మెగా హీరోలైన రామ్ చరణ్ ఉపాసనను ప్రేమించి పెళ్లి చేసుకుంటే వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠీ ని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లాడాడు. వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి దంపతులకు ఈమధ్యనే కొడుకు కూడా పుట్టాడు. అయితే మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా హీరోయిన్ ప్రేమలో ఉన్నాడనే ప్రచారం జరిగింది.
సాయి ధరమ్ తేజ్ తో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ రెజినా కాసాండ్రా తో ప్రేమలో ఉన్నాడనే ప్రచారం మాములుగా జరగలేదు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన ప్రేమ విషయాన్నీ, అది బ్రేకప్ అయిన విషయాన్ని రివీల్ చేసాడు. రీసెంట్ గా ఓ ఈవెంట్ లో పాల్గొనగా సాయి ధరం అక్కడ తన బ్రేకప్ స్టోరీ ని బయటపెట్టాడు. మీడియా చేసిన ప్రచారంతో 2023లో తన ప్రేయసితో బ్రేకప్ అయిందని చెప్పుకొచ్చాడు.
తనది చాలా బాధాకరమైన లవ్ స్టోరీ అని, తాను ప్రేమించిన ఆ అమ్మాయి తన కాలేజీలో గర్ల్ ఫ్రెండ్ అని, కానీ తనకు ఓ హీరోయిన్ తో ప్రేమ ఉంది అనే మీడియా ప్రచారాన్ని తట్టుకోలేకపోయిందని, అందుకే తన ప్రేమ బ్రేకప్ అయ్యింది అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనపై కొన్ని వెబ్ సైట్స్ రూమర్స్ నడిపించాయని వారికో దణ్ణం అంటూ సాయి ధరమ్ తేజ్ పెళ్లి విషయమై తానే స్వయంగా ప్రకటన చేస్తానంటూ ఆ ఈవెంట్ లో చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.