Advertisementt

బిగ్ బాస్ 9 - నాగార్జున క్లాస్ స్టార్ట్

Sat 13th Sep 2025 05:50 PM
bigg boss 9  బిగ్ బాస్ 9 - నాగార్జున క్లాస్ స్టార్ట్
Bigg Boss 9 new Promo released బిగ్ బాస్ 9 - నాగార్జున క్లాస్ స్టార్ట్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్స్ లో వీకెండ్ వచ్చింది అంటే చాలు.. అందులోను శనివారం ఎపిసోడ్ అంటే చాలామంది బుల్లితెర ప్రేక్షకులకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కారణం నాగార్జున ఏ కంటెస్టెంట్ తప్పులు ఎత్తి చూపుతారా అని వెయిట్ చేస్తుంటారు. మరి బిగ్ బాస్ సీజన్ 9 మొదలైన వారానికి వచ్చిన ఫస్ట్ వీకెండ్ లో నాగార్జున హౌస్ లో ఉన్న ఎవరెవరిని తిడతారనే విషయంలో ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. 

మరి ఈరోజు శనివారం ఎపిసోడ్ షూట్ పూర్తి కావడము, అందుకు గల ప్రోమో వదలడం జరిగిపోయింది. స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఈరోజు బాక్స్ లు బద్దలవ్వాల్సిందే అంటూ కంటెస్టెంట్స్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. బిగ్ బాస్ 9 ఫస్ట్ కెప్టెన్ అయిన సంజన కు ఈ రోజు నాగ్ క్లాస్ గ్యారెంటి అన్న రేంజ్ లో ఈ ప్రోమో ఉంది. 

ఈరోజు శనివారం ఎపిసోడ్ లో నాగార్జున మొదటి కెప్టెన్సీ ని దక్కించుకున్న సంజన కు క్లాస్ ఇవ్వబోతున్నారనే హింట్ వచ్చేసింది. సంజన తో పాటుగా నాగార్జున ఇచ్చే క్లాస్ లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారో అనేది మరికాసేపట్లో ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తే సరి.  

Bigg Boss 9 new Promo released :

Bigg Boss 9 latest Promo released 

Tags:   BIGG BOSS 9
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ