రీతూ వర్మ సినిమాల్లో అయినా కానీ, పబ్లిక్ ఫంక్షన్స్ లో కనిపించినా, సోషల్ మీడియాలో ఫొటోస్ వదిలినా.. చాలా పద్దతిగా కనిపిస్తుంది. చుడీదార్స్, శారీస్, లంగా ఓణీ లు ఇలా చాలా చక్కగా క్యూట్ గా రెడీ అయ్యి కనిపిస్తుంది. ఎప్పుడు గ్లామర్ లుక్స్ లో కనిపించదు. అందాలు ఆరబోసే విషయంలో రీతూ వర్మ మొదటి నుంచి మడి కట్టుకుని కూర్చుంటుంది.
అందుకే రీతూ వర్మకు స్టార్ హీరోలు అవకాశాలు కూసింత దూరంగానే ఆగిపోయాయి. అటు యంగ్ హీరోలు కూడా రీతూ వర్మ ను పట్టించుకోవడం మానేశారు. దేవిక అండ్ డ్యానీ తో డిజిటల్ ప్లాట్ ఫామ్ పైకి వెళ్ళొచ్చింది, అక్కడా సక్సెస్ అయ్యింది. కానీ ఇప్పుడు అవకాశాలు నిల్. అందుకేనేమో రీతూ వర్మ కొత్త అవతారమెత్తింది.
అది కూడా అందరికి షాకిచ్చే కొత్త లుక్ లో కనిపించింది. అందాలు ఆరబొయ్యడానికి ఇన్నాళ్లు పట్టిందా అనేలా రీతూ వర్మ తాజా లుక్ ఉంది. వైట్ షర్ట్ లో అందాలు కనిపించి కనిపించకుండా రీతూ వర్మ గ్లామర్ షో ఉంది. ఆ పిక్స్ చూసాక హమ్మ రీతూ వర్మ ఇంతపెద్ద షాకిచ్చావ్ అంటూ ఆమె అభిమానులే కామెంట్లు పెడుతున్నారు.