క్యూట్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం షూటింగ్స్ అంటూ టాలీవుడ్, బాలీవుడ్ ని చుట్టేస్తోంది. హైదరాబాద్, ముంబై ఇలా శ్రీలీల తెగ తిరిగేస్తుంది. ఈమధ్యన సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. స్పెషల్ ఫొటోస్, గ్లామర్ ఫొటోస్ అంటూ మత్తెక్కిస్తోంది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీతో మింగిల్ అవుతుంది.
ఏమైనా అంటే నేను ప్రేమలోనా.. నో నెవ్వర్ అంటుంది. కార్తీక్ ఫ్యామిలీతో కలిసి గణపతి పూజలో పాల్గొనడమే కాదు ఇప్పుడు బాలీవుడ్ లోనే జెండా పాతెయ్యడానికి రెడీ అవుతూ సైజ్ జీరో ని మైంటైన్ చేస్తుంది అనే విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈమధ్యన మరీ సన్నగా కనిపిస్తుంది.
తాజాగా ఆరెంజ్ శారీ లో శ్రీలీల చాలా క్యూట్ గా హాట్ గా కనిపించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అమాయకంగా కనిపించిన శ్రీలీల ను చూస్తే యూత్ గుండె జారిపోవడం ఖాయం. అంతలాంటి క్యూట్ అండ్ స్వీట్ లుక్ తో శ్రీలీల మెస్మరైజ్ చేసింది.