సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే క్యూట్ అండ్ గ్లామర్ బ్యూటీ జాన్వీ కపూర్ అందాల ఆరబోత విషయంలో తగ్గేదేలే అంటుంది. సినిమాల్లో ఆమె చేసిన కేరెక్టర్స్ చూస్తే.. అన్ని నటనకు స్కోప్ ఉన్న పాత్రలే. ఎక్కడా గ్లామర్ ప్రదర్శన ఉండదు. కానీ సాంగ్స్ లో ఈ పరం సుందరి అందాల ఆరబోతతో దుమ్మురేపుతోంది.
రీసెంట్ గా పరం సుందరి రిజల్ట్ తో డిజప్పాయింట్ అయిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మళ్లీ యాక్టీవ్ అయ్యింది. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫోటో షూట్స్ తో సర్ ప్రైజ్ చేసే ఈ సుందరి తాజాగా వదిలిన ఫొటోస్ చూస్తే యూత్ కి కునుకు రాదంటే నమ్మాల్సిందే.
జాన్వీ కపూర్ లేటెస్ట్ గా మోడ్రెన్ డ్రెస్ లో మతిపోయే అందాలతో అద్దరగొట్టేసింది. ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం పెద్ది చిత్రంలో రామ్ చరణ్ సరసన నటించడమే కాదు ఆమె నటించిన హిందీ చిత్రం ఒకటి రిలీజ్ కి రెడీ అయ్యింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆ ప్రమోషన్స్ లోనే బిజీగా వుంది.