కోలీవుడ్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటించిన మదరాసి గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఏ రకంగానూ ప్రేక్షకులను ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. క్రిటిక్స్ కూడా యావరేజ్ రివ్యూస్ ఇవ్వడంతో మరోసారి మురుగదాస్ దర్శకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. కొన్నేళ్లుగా మురుగదాస్ సక్సెస్ కి దూరమైపోయారు.
తెలుగులో సో సో అనిపించిన మదరాసి తమిళంలో పర్వాలేదనిపించింది. అయితే జస్ట్ వీకెండ్ వరకే.. వీకెండ్ ముగిసి సోమవారం నుంచి మదరాసి కలెక్షన్స్ తమిళనాట కూడా డ్రాప్ అయ్యాయి. తాజాగా మదరాసి క్లైమాక్స్ పై డైరెక్టర్ మురుగదాస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట మదరాసి క్లైమాక్స్ ను హీరోయిన్ చనిపోవడంతో ప్లాన్ చేశానని చెప్పారు.
అసలైతే క్లైమాక్స్ హీరోయిన్ చావుతో ముగుస్తుంది. కానీ తన గర్ల్‌ఫ్రెండ్ ను కాపాడలేకపోతే అసలు హీరో క్యారెక్టర్ వీక్ అయిపోతుందని అనిపించి షూటింగ్ మధ్యలో క్లైమాక్స్ ను మార్చేసినట్టుగా మురుగదాస్ చెప్పుకొచ్చారు. మరి అంతా అయిపోయాక ఇలాంటి కథలు ఎన్ని చెప్పినా వర్కౌట్ అవ్వదు అని మురుగదాస్ కి తెలియని విషయమైతే కాదు కదా.