మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం హాట్ టాపిక్ అయ్యింది. తన అనుమతి లేకుండా పేరు, ఫొటోలను వాడుతూ.. కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి అశ్లీల కంటెంట్‌ను సృష్టిస్తున్నారని.. దానికి అడ్డుకట్ట వేయాలంటూ ఐశ్వర్య రాయ్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది.
సోషల్ మీడియాలో ఈ రకమయిన ఫొటోస్ వాడుతూ తన ప్రవైసికి భంగం వాటిల్లేలా చేస్తున్నారంటూ ఐష్ హై కోర్టుకు విన్నవించుకుంది. మంగళవారం జరిగిన విచారణలో ఐశ్వర్య రాయ్ తరపు న్యాయవాది సందీప్ సేథీ తన వాదనలు వినిపించారు. ఐశ్వర్య రాయ్ ఫొటోస్ కానీ, ఆమె రూపాన్ని కానీ, వ్యక్తిత్వాన్ని కానీ ఉపయోగించుకునే హక్కు ఎవరికీ లేదు..
ఒక వ్యక్తి కేవలం నటి పేరు, ముఖం పెట్టుకుని డబ్బు సంపాదిస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకరం అంటూ న్యాయవాది సందీప్ సేథీ కోర్టులో వాదనలు వినిపించారు. ఐశ్వర్య రాయ్ ఆవేదనను అర్థం చేసుకున్న ఢిల్లీ హైకోర్టు ఈ అంశంపై తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.