టాలీవుడ్ నుంచి కనిపించకుండా పోయి బాలీవుడ్ కే అంకితమైన రకుల్ ప్రీత్ సింగ్ ముంబై కుర్రాడు, బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాత అయిన జాకీ భగ్నానీ ని ప్రేమ వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయ్యింది. బాలీవుడ్ నే నమ్ముకున్న రకుల్ కి అక్కడ విజయమనేది దక్కడమే లేదు.
ఇక జయాపజయాలతో సంబంధం లేని రకుల్ ప్రీత్ సినిమాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోస్ వదులుతూ చాలా బిజీగా ఉంటుంది. ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్లినా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసినా ఆ విషయాన్ని సోషల్ మీడియాకి చేరవేస్తుంది. తాజాగా రకుల్ ప్రీత్ శివారాధనలో మునిగిపోయింది.
కాశి విశ్వనాధ్ టెంపుల్ ని దర్శించి గంగాహారతి ఇస్తున్న ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. రకుల్ గంగ కు హారతి ఇస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ప్రస్తుతం రకుల్ కాశి ఫొటోస్ వైరల్ అయ్యాయి.