Advertisementt

విడుదలకు ముందే మిరాయ్ లాభాలు

Sun 07th Sep 2025 09:16 PM
mirai  విడుదలకు ముందే మిరాయ్ లాభాలు
Mirai profit before release విడుదలకు ముందే మిరాయ్ లాభాలు
Advertisement
Ads by CJ

 ఈమధ్యన భారీగా బిజినెస్ చేసిన సినిమాలే బాక్సాఫీసు వద్ద బోల్తా పడుతున్నాయి. భారీ బడ్జెట్ లతో సినిమాలు తెరకెక్కి అంతే  భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుని థియేటర్స్ లో విడుదలవుతుంటే.. అవి బ్రేక్ ఈవెన్ అవ్వక సతమతమవుతున్నాయి. నిర్మాతలు ఎలా ఉన్నా సినిమాలు కొన్న బయ్యర్లు కోట్లలో నష్టపోతున్నారు. 

టాలీవుడ్ నిర్మాత నాగవంశీ కింగ్ డమ్, వార్ 2 దెబ్బకి సైలెంట్ అయ్యారు. కానీ ఆయనని మలయాళ ఫిలిం కొత్త లోక కొంత నిలబెట్టింది. ఇలాంటి టైమ్ లో ఓ యువ హీరో సినిమా టేబుల్ ఫ్రాఫిట్ తో బాక్సాఫీసు దగ్గరకు రావడం షాకిచ్చే విషయం. ఆయనేమి పెద్ద స్టార్ కాదు అయినా ఆయన నటించిన చిత్రానికి విపరీతమైన క్రేజ్ ఉంది. 

అదే తేజ సజ్జ నటించిన మిరాయ్. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో హనుమాన్ తో స్టార్ అవతారమెత్తిన తేజ సజ్జ హీరోగా మంచు మనోజ్ విలన్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మించిన మిరాయ్ సెప్టెంబర్ 12 న విడుదలవుతుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యే ఈ చిత్రాన్ని తేజ సజ్జ, మంచు మనోజ్ లు ప్రమోషన్స్ లో వేరే లెవల్ చూపిస్తున్నారు.  

రూ.60 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం.. 20 కోట్ల లాభాలతో బాక్సాఫీసు దగ్గరకు రాబోతుంది అని తెలుస్తుంది. నాన్- థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ.45 కోట్ల ఆదాయం వచ్చిందట. రూ. 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్ తో నిర్మాతలు సినిమాను విడుదల చేయబోతున్నట్లు గా టాక్. మరి ఇది షాకిచ్చే విషయం కాక ఇంకేమిటి.

Mirai profit before release:

Mirai Earns Over Rs. 20 Crore Profit Ahead of Release

Tags:   MIRAI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ