చాలామంది స్టార్స్ కాదు కాదు పాన్ ఇండియా హీరోలు సినిమాల్లో తమ పాత్ర షూటింగ్స్ పూర్తి చేసేసి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ ప్రమోషన్స్ విషయంలో వారు లైట్ గా కనిపిస్తున్నారు. హీరోలు లైట్ గా ఉంటున్నారో నిర్మాతలు ప్రమోషన్స్ కు డబ్బు ఖర్చు ఎందుకు అనుకుంటున్నారో తెలియదు కానీ.. భారీ బడ్జెట్ మూవీస్, పాన్ ఇండియా మూవీస్ ని ప్రమోట్ చేస్తేనే అన్ని భాషలకు రీచ్ అవుతుంది అనే విషయాన్ని విస్మరిస్తున్నారు.
రాజమౌళి బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ కు ఫాలో అయిన ప్రమోషన్స్ స్ట్రాటజీని ఏ హీరో ఇప్పటివరకు మళ్ళీ ఫాలో అవ్వలేదు. ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ ఇలా ఎవ్వరూ పాన్ ఇండియా ప్రమోషన్స్ ను సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడొక కుర్ర హీరో స్టార్ హీరోలకు షాకిచ్చేలా తన సినిమాని పాన్ ఇండియా వ్యాప్తంగా ప్రమోట్ చేసిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
హనుమాన్ తో అద్భుతమైన హిట్ కొట్టి మిరాయ్ తో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తేజ సజ్జ. విలన్ కేరెక్టర్ చేసిన మంచు మనోజ్ తో కలిసి తేజ సజ్జ మిరాయ్ చిత్రాన్ని టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు, చెన్నై నుంచి బెంగుళూరు వరకు పిచ్చ పిచ్చగా ప్రమోట్ చేస్తున్నాడు. తేజ సజ్జ ప్రమోషనల్ స్ట్రాటజీ చూసి పాన్ ఇండియా ఆడియన్స్ ఆశ్చర్య చకితులవుతున్నారు.
ముంబై లో కరణ్ జోహార్ పక్కన నిలబడి ముంబై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడం ఇలా తేజ సజ్జ మిరాయ్ ని ప్రమోట్ చేస్తున్న తీరుని చూసి స్టార్ హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది.