కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ సప్త సాగరాలు దాటి చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయమైంది. అంతేనా ఆమెకు స్టార్స్ హీరోల ప్రాజెక్ట్స్ లో బిగ్ ఆఫర్స్ వచ్చాయి. అమ్మడు సక్సెస్ రేట్ పట్టించుకోకుండా ఆమె క్యూట్ లుక్స్, అందానికి ఆకర్షితులై రుక్మిణికి పలు భాషల్లో రెడ్ కార్పెట్ పరుస్తున్నారు.
రుక్మిణి వసంత్ చేతిలో పాన్ ఇండియా ఫిలిమ్స్ ఉన్నాయి. అందులో ముఖ్యంగా కాంతార 1, ఎన్టీఆర్-నీల్ కలయికలో వస్తున్నడ్రాగన్ చిత్రం, అలాగే యష్ తో చెయ్యబోయే టాక్సిక్. ఈ మూడు క్రేజీ చిత్రాలే. అయితే ముందుగా అమ్మడు తమిళనాట మదరాసి తో లక్కు టెస్ట్ చేసుకోబోతుంది. మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ తో రుక్మిణి వసంత్ నటించిన మదరాసి రేపు శుక్రవారం విడుదల కాబోతుంది.
ఈ చిత్రంతో బిగ్ హిట్ కొట్టి తానేమిటో నిరూపించుకుని, తనకి వచ్చిన అవకాశలకు సార్ధకత చూపించాలని అని ఎదురు చూస్తుంది. మదరాసి ప్రమోషన్స్ లో రుక్మిణి వసంత్ ని చూసి చాలామంది ఈ అమ్మాయికి ఫ్యూచర్ ఉంది, క్యూట్ లుక్స్ మాత్రమే కాదు మంచి నటన చూపిస్తే ఆమె కెరీర్ అదిరిపోతోంది. మదరాసి హిట్టు అయితే ఆమెకు ఉండదు ఎదురు అంటూ కామెంట్లు పెడుతున్నారు.