అన్న చిరు కి తమ్ముడు పవన్ థాంక్స్
Pawan thanks his Brother Chiruతమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా అన్న మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా,
ప్రజా జీవితంలో జనసేనాని గా,
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సేవలో నువ్వు చూపుతున్న అంకితభావం చిరస్మరణీయం.
ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండునూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను.🤍
దీర్ఘాయుష్మాన్ భవ! @PawanKalyan అంటూ ట్వీట్ చేసారు చిరు.
మరి అన్న బర్త్ డే విషెస్ ని అందుకున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ అదే సోషల్ మీడియా వేదికగా చిరు కి థాంక్స్ చెప్పారు.
నా జీవితానికి మార్గదర్శి, తండ్రి సమానులైన అన్నయ్య, పద్మ విభూషణ్ శ్రీ @KChiruTweets గారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ప్రేమాభిమానాలు, పుట్టినరోజు శుభాకాంక్షలు ఎంతో ఆనందం కలిగించాయి. సమాజానికి ఏదైనా చేయాలని, మీరు నేర్పిన సేవా గుణమే ఈరోజు @JanaSenaParty ద్వారా ప్రజలకు సేవ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎల్లప్పుడూ నాతో పాటుగా కోట్లాది మందికి మార్గదర్శకుడిగా నిలవాలని కాంక్షిస్తున్నాను... అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.
Pawan Kalyan birthday: Chiranjeevi wishes his brother







































