పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫైనల్ గా మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ షూటింగ్ ముగించేశారు, కానీ పాటలు బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోపక్క హను రాఘవపూడి తో ప్రభాస్ చేస్తున్న ఫౌజీ షూటింగ్ కూడా శరవేగంగానే కదులుతుంది. ఇక సెప్టెంబర్ అంటే ఈనెల చివరి వారంలో ప్రభాస్ సందీప్ వంగ తో కలిసి స్పిరిట్ సెట్ పైకి వెళ్లాల్సి ఉంది.
ఆతర్వాత ప్రశాంత్ నీల్ తో సలార్ 2, నాగ్ అశ్విన్ తో కల్కి 2 సినిమా చెయ్యాల్సి ఉంది. కల్కి 2 షూటింగ్ ఇదిగో అదిగో అనడమే కానీ అది ఎప్పుడు మొదలవుతుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూడక తప్పేలా కనిపించడం లేదు. ఇప్పుడు కల్కి 2 పై ఓ న్యూస్ ప్రభాస్ ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తుంది. కల్కి సీక్వెల్‌పై దర్శకుడు నాగ్ అశ్విన్ రీసెంట్‌గా ఓ పోడ్‌కాస్ట్ లో బాంబ్ పేల్చాడు.
ఆ పోడ్‌కాస్ట్ లో నాగ్ అశ్విన్ కల్కి సీక్వెల్ పై ఓపెన్ అయ్యాడు. అసలైతే ఈ ఏడాది( 2025 )చివరి నాటికి కల్కి 2 చిత్రాన్ని పట్టాలెక్కించాలని.. ఆ తర్వాత షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి 2026 లేదా 2027 లో ఈ కల్కి 2 ను రిలీజ్ చేయాలని ఆయన ప్లాన్ చేశారట.
కానీ, ప్రస్తుత పరిస్థితులు, నటీనటులు డేట్స్ చూస్తుంటే తను అనుకున్న దానికంటే ఎక్కువ సమయం ఈ సినిమాకు పడుతుందని నాగ్ అశ్విన్ చెప్పడంతో కల్కి 2 ఇప్పట్లో లేనట్లే, అందుకే ప్రభాస్ లైనప్ మరిపోతుంది అంటూ అభిమానులు నిరాశపడిపోతున్నారు.