Advertisementt

ఆంధ్రా టాలీవుడ్.. బాల‌కృష్ణ త‌డ‌బాటు

Sun 31st Aug 2025 06:05 PM
balakrishna  ఆంధ్రా టాలీవుడ్.. బాల‌కృష్ణ త‌డ‌బాటు
Andhra Tollywood.. Balakrishna ఆంధ్రా టాలీవుడ్.. బాల‌కృష్ణ త‌డ‌బాటు
Advertisement
Ads by CJ

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ఏం మాట్లాడినా ముక్కు సూటిగానే ఉంటుంది. ఆయ‌న దేనికీ భ‌య‌ప‌డ‌రు. ఉన్న మాట సూటిగా అనేస్తారు. కోపం వ‌చ్చినా.. ప్రేమ పుట్టినా.. ఆయ‌న‌తో వ్య‌వ‌హారం అలానే ఉంటుంది..`` ఇలాంటి కొటేష‌న్ విన‌డానికి అందంగా విన‌సొంపుగా బావుంటుంది కానీ, ఒక విష‌యంలో మాత్రం న‌ట‌సింహాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కి చెందిన ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నారు.

ఈ శ‌నివారం సాయంత్రం, న‌టుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా `వ‌ర‌ల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్-యుకె` స‌న్మాన కార్య‌క్ర‌మంలో నంద‌మూరి బాల‌కృష్ణ ఏపీ లో సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి గురించి పెద్ద ప్ర‌క‌ట‌న చేసారు. ఆంధ్ర రాష్ట్రంలోను సినీప‌రిశ్ర‌మ అభివృద్ధి చెందాల‌నే త‌న బ‌ల‌మైన ఆకాంక్ష‌ను వేదిక‌పై తెలంగాణ మంత్రుల స‌మ‌క్షంలో బ‌య‌ట‌పెట్టారు.

బాల‌య్య బాబు ఈ పెద్ద ప్ర‌క‌ట‌న చేస్తున్న స‌మ‌యంలో తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి, అలాగే మ‌రో తెలంగాణ మంత్రి బండి సంజ‌య్ అక్క‌డే ఉన్నారు. అప్ప‌టికే బాల‌య్య బాబును విప‌రీతంగా పొగిడేసిన మంత్రులు స‌డెన్ గా ఈ పెద్ద‌ ప్ర‌క‌ట‌నతో అవాక్క‌య్యారు. అదంతా స‌రే కానీ, ఈ విపత్క‌ర ప‌రిస్థితిని క‌వ‌ర్ చేయ‌డానికి ఎన్బీకే చాలా పాట్లు ప‌డ్డారు.

త‌న వ్యాఖ్య‌ల అంత‌రార్థం గురించి వివ‌రిస్తూ క‌వ‌ర్ చేయ‌డానికి బాల‌య్య ట్రై చేసారు. ఏపీలో స‌హ‌జ సౌంద‌ర్యం ఉంది.. అందాలున్నాయి. అందువ‌ల్ల షూటింగులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎన్బీకే అన్నారు. తెలంగాణ‌లోను అద్బుత‌మైన లొకేష‌న్లు ఉన్నాయి అంటూనే ఏపీలో ఉపాధి పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. నిజానికి బాల‌య్య బాబు ప్ర‌క‌ట‌న‌లో ఎలాంటి త‌ప్పిదం లేదు. ఉన్న మాటే ఆయ‌న‌ అన్నారు.

రాజ‌ధాని లేక‌, ప‌రిశ్ర‌మ‌లు రాక ఆంధ్రప్ర‌దేశ్‌ విప‌త్క‌ర ప‌రిస్థితిలో ఉంది. ఇక్క‌డ స‌రైన ఉపాధి లేక‌, తిండికి లేక హైద‌రాబాద్, ముంబై లేదా ఇంకేదైనా మెట్రో న‌గ‌రానికి యువ‌త‌రం త‌ర‌లి వెళ్లిపోతోంది. అలా కాకుండా నీతిమంతులైన రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌భుత్వాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే స్థానికంగా ఉపాధిని క‌ల్పించి, అన్ని ప‌రిశ్ర‌మ‌ల్ని ర‌ప్పించి, న‌గ‌రాల‌ను అభివృద్ధి చేస్తే ఇలాంటి గ‌త్యంత‌రం ప‌ట్టదు క‌దా! అని కొంద‌రు విశ్లేషిస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం ఏపీలో సీఎన్‌బి ప్ర‌భుత్వం  రోజుకో ప‌రిశ్ర‌మ‌ను ప్ర‌క‌టిస్తూ ఊపు తెస్తోంది. కానీ రాజ‌ధాని నిర్మాణం అనే సంక్లిష్ఠ ప్ర‌క్రియ పూర్త‌యి, ప‌రిశ్ర‌మ‌లు రూపు రేఖ‌లు వ‌చ్చేప్ప‌టికి ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ పోయి కొత్త జ‌న‌రేష‌న్ వ‌స్తుంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో మ‌రో గ్లామ‌ర్ ప‌రిశ్ర‌మ అభివృద్ధి ఎప్ప‌టికి జ‌రుగుతుందో ఊహ‌కైనా అంద‌ని ప‌రిస్థితి ఉంది!!

Andhra Tollywood.. Balakrishna:

Balakrishna In Gold Edition Of World Book Of Records

Tags:   BALAKRISHNA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ