Advertisementt

ఇప్పుడు NTR-Neel అప్ డేట్ ఇస్తే..

Tue 26th Aug 2025 05:43 PM
ntr  ఇప్పుడు NTR-Neel అప్ డేట్ ఇస్తే..
NTR-Neel movie update ఇప్పుడు NTR-Neel అప్ డేట్ ఇస్తే..
Advertisement
Ads by CJ

మే 20 న వార్ 2 ట్రీట్ కారణంగా తన సినిమా NTR-Neel అప్ డేట్ ఇవ్వడం లేదు, వార్ 2 టీజర్ ని చూసి ఎంజాయ్ చెయ్యమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు చెప్పిన దర్శకుడు ప్రశాంత్ నీల్.. ఇప్పుడు ఆ డ్రాగన్(వర్కింగ్ టైటిల్) అప్ డేట్ ఇస్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కూల్ చేసిన వారవుతారు. కారణం ఆ వార్ 2 విషయంలో ఎన్టీఆర్ పై వస్తున్న ట్రోల్స్ చూసి ఫ్యాన్స్ కుమిలిపోతున్నారు. 

వార్ 2 ప్లాప్ అయినా వారు అంతగా బాధపడేవారు కాదేమో.. కానీ ప్రత్యేకంగా ఎన్టీఆర్ ని టార్గెట్ గా పెట్టుకుని కొంతమంది పనిగట్టుకుని ట్రోల్ చెయ్యడం వారు భరించలేకపోతున్నారు. ఇలా వారు బాధలో ఉన్న సమయంలో NTR-Neel కాంబో మూవీ నుంచి ఏదైనా అప్ డేట్ వస్తే వారి బాధను పోగొట్టుచ్చు అనేది కొంతమంది అభిప్రాయం. 

అది వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్-నీల్ మూవీ నుంచి ఏదైనా సర్ ప్రైజ్ ఇస్తే బావుంటుంది. మరి వార్ 2 విషయంలో ఎన్టీఆర్ మౌనం వారిని బాధపెడుతున్నా ఎన్టీఆర్-నీల్ అప్ డేట్ వారిని ఆ బాధనుంచి కోలుకునేలా చేస్తుంది.. మరి మేకర్స్ ఆ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి. 

NTR-Neel movie update :

Fans Request: NTR-Neel movie update 

Tags:   NTR
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ