పవన్ కళ్యాణ్ రీసెంట్ చిత్రం హరి హర వీరమల్లు.. దాని రిజల్ట్ ఏమిటో అనేది అందరికి తెలుసు. పవన్ కళ్యాణ్ కోపరేషన్ ఎలా ఉందొ వీరమల్లు రిజల్ట్ చూస్తే తెలుస్తుంది. క్రిష్ తప్పుకోవడం జ్యోతి కృష్ణ వీరమల్లు ను హ్యాండిల్ చేసిన విధానం, VFX వర్క్ అన్ని హరి హర వీరమల్లుని నిలువునా ముంచేసాయి.
అయినప్పటికీ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న OG పై పై విపరీతమైన క్రేజ్ పెరిగిపోతుంది. సుజిత్ దర్శకత్వంలో గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ మాస్ లుక్స్ పవన్ ఫ్యాన్స్ ను నిలువనియ్యడం లేదు. మరోపక్క పాన్ ఇండియా నటులు ఈచిత్రంలో నటించడం, పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత చేస్తున్న స్ట్రయిట్ మూవీ కావడం, OG కంటెంట్ మొత్తం పాన్ ఇండియా ఆడియన్స్ సినిమా కోసం వెయిట్ చేసేలా అంచనాలు పెరిగాయి.
అందుకే OG మేకర్స్ కూడా కాన్ఫిడెన్స్ తో నెల రోజుల ముందుగానే ఓవర్సీస్ లో OG బుకింగ్స్ ని మొదలు పెట్టేసారు. ప్రస్తుతం OG క్రేజ్ ని క్యాష్ చేసుకోవడానికి మేకర్స్ ఈ విషయంలో తెలివిగా వ్యవహారించి ఆగస్ట్ 29 నుంచి టికెట్ సేల్స్ మొదలు పెట్టడం అద్భుతమైన స్ట్రాటజీ చెప్పాలి. మరి OG టాక్ బావుంది అంటే ఈసారి పవన్ సినిమా ఓవర్సీస్ లో నే కాదు పాన్ ఇండియా మార్కెట్ లో ఊచకోత ఖాయం.