ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Anil Sunkara Learnt lesson from back to back failures

ఆ రెండు డిజాస్ట‌ర్లు నేర్పిన పాఠం

Anil Sunkara Learnt lesson from back to back failuresAnil Sunkara Learnt lesson from back to back failures

బ్యాక్ టు బ్యాక్ డిజాస్ట‌ర్లు ఎదురైతే నిర్మాత ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించ‌గ‌లం. 2023లో రెండు వ‌రుస డిజాస్ట‌ర్లు ఈ నిర్మాత‌ను ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఆ రెండు సినిమాల దెబ్బ‌కు అత‌డు మ‌ళ్లీ కోలుకోవ‌డం క‌ష్టంగా మారింది. భారీ హోప్స్ పెట్టుకున్న ఆ రెండు సినిమాలు బ‌య్య‌ర్లు, పంపిణీ వ‌ర్గాల‌కు తీవ్ర న‌ష్టాలు తెచ్చాయి. దీంతో టాలీవుడ్ లో ఆయ‌న ప‌రప‌తికి భంగం ఏర్ప‌డింది. ఆర్థికంగాను తీవ్ర ఇబ్బందుల్లోకి వెళ్లార‌ని క‌థ‌నాలొచ్చాయి.

ఆ రెండు సినిమాలు ఏవి? ఆ  నిర్మాత ఎవ‌రు? అంటే...! భోళాశంక‌ర్, ఏజెంట్ లాంటి డిజాస్ట‌ర్ల‌తో డీలా ప‌డిపోయిన నిర్మాత అనీల్ సుంక‌ర‌. 2023లో కేవ‌లం నాలుగు నెల‌ల గ్యాప్ తో విడుద‌లైన ఈ రెండు చిత్రాలు డిజాస్ట‌ర్ ఫ‌లితాల‌తో అనీల్ సుంక‌ర‌కు తీవ్ర న‌ష్టాల్ని తెచ్చాయి. ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్ అప్ప‌టి నుంచి సినిమాలు నిర్మించ‌డం లేదు.

సందీప్ కిష‌న్ హీరోగా `మ‌జాకా`(2025) అనే ఓ చిన్న‌ చిత్రాన్ని మాత్ర‌మే తెర‌కెక్కించారు. ఆ త‌ర్వాత ఈ బ్యాన‌ర్ స్థ‌బ్ధుగా ఉండిపోయింది. ఒక‌ప్పుడు మ‌హేష్, బాల‌కృష్ణ లాంటి అగ్ర‌హీరోల‌తో సినిమాలు తీసిన ఈ బ్యాన‌ర్ ప్ర‌స్తుతం సైలెంట్ గా ఉంది. అయితే నిర్మాత బావుంటేనే ప‌రిశ్ర‌మ బావుంటుంది. అనీల్ సుంక‌ర తిరిగి దూకుడు, లెజెండ్ లాంటి సినిమాలు నిర్మించాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. 

Anil Sunkara back to back failures

anil sunkara