Advertisementt

వివాదం లో కన్నడ స్టార్ యష్ తల్లి

Sat 23rd Aug 2025 08:47 PM
deepika das  వివాదం లో కన్నడ స్టార్ యష్ తల్లి
Deepika Das has slammed Pushpa వివాదం లో కన్నడ స్టార్ యష్ తల్లి
Advertisement
Ads by CJ

కన్నడ చిత్ర సీమ నుంచి కెజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ ప్రస్తుతం టాక్సిక్ మూవీలో నటిస్తున్నాడు. అయితే యష్ తల్లి పుష్ప కొడుకు క్రేజ్ తో నిర్మాతగా మారారు. ఆమె రీసెంట్ గానే కొత్తలవాడి అనే కన్నడ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం హిట్ అవ్వలేదు.  తాజాగా యష్ తల్లి పుష్ప ఓ వివాదంలో ఇరుక్కున్నారు. 

ఆమె కన్నడ లో ఓ హీరోయిన్ ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పుష్ప పై కన్నడ ఆడియన్స్ ఫైర్ అయ్యేలా చేసాయి. ఈమధ్యన పుష్ప ఓ ఈవెంట్ లో పాల్గొన్నారు. అక్కడ ఆమె ప్రముఖ కన్నడ నటి దీపికా దాస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీపిక దాస్ పెద్ద హీరోయిన్ ఏమీ కాదు. అసలు ఆమె ఇండస్ట్రీలో ఏం సాధించింది అంటూ మీడియా ముందు మాట్లాడడం వివాదానికి కారణమైంది. 

ఒకే ఒక్క సినిమాతో నిర్మాతగా మారిన పుష్ప ఇలా ఓ పేరున్న హీరోయిన్ పై ఇష్టం వచ్చిన కామెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ నెటిజెన్స్ యష్ తల్లి పుష్ప పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తల్లి హీరోయిన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే యష్ ఏం చేస్తున్నాడు అంటూ అటు యష్ పై కూడా వారు ఫైర్ అవుతున్నారు. 

Deepika Das has slammed Pushpa:

Deepika Das has slammed Pushpa, mother of Rocking Star Yash

Tags:   DEEPIKA DAS
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ