Advertisementt

ర‌వీనా టాండ‌న్ కుమార్తె టాలీవుడ్ డెబ్యూ

Fri 22nd Aug 2025 09:37 PM
raveena tandon  ర‌వీనా టాండ‌న్ కుమార్తె టాలీవుడ్ డెబ్యూ
Raveena Tandon Daughter To Star With JK ర‌వీనా టాండ‌న్ కుమార్తె టాలీవుడ్ డెబ్యూ
Advertisement
Ads by CJ

మేటి క‌థానాయిక ర‌వీనా టాండ‌న్ కుమార్తె రాషా త‌డానీ బాలీవుడ్ లో వేవ్స్ క్రియేట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. వాలు క‌ళ్ల‌తో వ‌ల‌లు వేసే ఈ బ్యూటీ, ఇటీవ‌లే అజ‌య్ దేవ‌గ‌న్ మేన‌ల్లుడు అమ‌న్ దేవ‌గ‌న్ స‌ర‌స‌న ఆజాద్ అనే చిత్రంలో న‌టించింది. కానీ ఈ సినిమా ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

ఇంత‌లోనే రాషా త‌డానీ టాలీవుడ్ లో అడుగు పెడుతోందంటూ ప్ర‌చారం సాగుతోంది. నంద‌మూరి బాల‌కృష్ణ న‌ట‌వార‌సుడు మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమాలో రాషా క‌థానాయిక‌గా న‌టిస్తుంద‌ని ప్ర‌చారం సాగింది. కానీ  ఈ సినిమా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో వాయిదా ప‌డింది. త‌దుప‌రి ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబ హీరో జ‌య‌కృష్ణ (ర‌మేష్ బాబు వార‌సుడు) స‌ర‌స‌న రాషా ఎంపికైంద‌ని తాజాగా లీకైంది. 

ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. అజ‌య్ భూప‌తి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారు. వైజ‌యంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించ‌నుంది. టైటిల్ స‌హా ఇత‌ర వివ‌రాలు వెల్ల‌డించాల్సి ఉంది.

Raveena Tandon Daughter To Star With JK:

Rasha Thadani Pairing With Ghattamaneni Jaya Krishna

Tags:   RAVEENA TANDON
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ