Advertisementt

పవన్ విషెస్ - చిరు ఎమోషనల్

Fri 22nd Aug 2025 10:15 AM
chiranjeevi  పవన్ విషెస్ - చిరు ఎమోషనల్
Chiranjeevi Thanks Brother Pawan Kalyan పవన్ విషెస్ - చిరు ఎమోషనల్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా స్టార్ హీరో, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న చిరు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. తమ్ముడు పవన్ విషెస్ అందుకున్న మెగాస్టార్ చిరు ఎమోషనల్ అవుతూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

జ‌న సైన్యాధ్య‌క్షుడికి విజ‌యోస్తు!

త‌మ్ముడు క‌ల్యాణ్‌...

ప్రేమ‌తో పంపిన‌ పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. ప్ర‌తీ మాట‌.. ప్ర‌తీ అక్ష‌రం నా హృద‌యాన్ని తాకింది. అన్న‌య్య‌గా న‌న్ను చూసి నువ్వెంత గ‌ర్విస్తున్నావో.. ఓ త‌మ్ముడిగా నీ విజ‌యాల్ని, నీ పోరాటాన్ని నేను అంత‌గా ఆస్వాదిస్తున్నాను. నీ కార్య‌దీక్ష‌త‌, ప‌ట్టుద‌ల చూసి ప్ర‌తీ క్ష‌ణం గ‌ర్వ‌ప‌డుతూనే ఉన్నా. నిన్ను న‌మ్మిన‌వాళ్ల‌కు ఏదో చేయాల‌న్న త‌ప‌నే నీకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త శ‌క్తిని ఇస్తుంది. 

ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జన‌సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై న‌డిపించు. వాళ్ల ఆశ‌లకు, క‌ల‌ల‌కు కొత్త శ‌క్తినివ్వు. అభిమానుల‌ ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా ల‌భిస్తూనే ఉండాలి. ఓ అన్న‌య్య‌గా నా ఆశీర్వ‌చ‌నాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్ర‌తీ అడుగులోనూ విజ‌యం నిన్ను వ‌రించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని కోరుకొంటున్నాను.

@APDeputyCMO

 @PawanKalyan 

Chiranjeevi Thanks Brother Pawan Kalyan :

Chiranjeevi Thanks Brother Pawan Kalyan For Birthday Wishes Sent With Love

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ