ఇంట్లో వాళ్లను వ్యతిరేకించి సినీపరిశ్రమకు వచ్చిన నటీమణుల జాబితాలో కంగన పేరు ఉంది. సనాతన సాంప్రదాయ ఆచారాలను పాటించే కుటుంబం నుంచి వచ్చిన కంగనను తొలుత నటి అవుతానంటే తల్లిదండ్రులు ప్రోత్సహించలేదు. కానీ కంగన ముంబైకి బట్టల బ్యాగ్ సర్ధుకుని వచ్చేసింది. ముంబైలో ఒక హాస్టల్ గదిలో దిగి, తర్వాత ఒక ఫ్లాట్ కి మారి తన ప్రయత్నాలు కొనసాగించింది. మోడల్ గా నటిగా మారింది. నెమ్మదిగా స్టార్ అయింది.
అయితే రంగుల ప్రపంచానికి పూర్తి వ్యతిరేకులు అయిన కుటుంబీకులతో కంగన పోరాటం చిన్నది కాదు. అసలు తన కుటుంబంలో పితృస్వామ్య వ్యవస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంట్లో పెద్ద పిల్లను సరిగా పెంచకపోతే, చిన్న పిల్లలకు పెళ్లిళ్లు కావు! అంటూ తిట్టేవారు. అది తనను చాలా బాధించేది. తన సోదరీమణులకు దూరం చేసేది. దానికి ఎంతో కలతకు గురయ్యేదట. చివరికి ఒంటరితనాన్ని అనుభవించానని కూడా కంగన చెప్పింది.
అంతేకాదు.. తన తల్లి ఆస్పత్రిలో మొదట మగ శిషువును ప్రసవించగా, 10రోజులకే చనిపోయాడు. 3.5 కేజీల బరువుతో ఆరోగ్యంగా పుట్టిన బిడ్డను కోల్పోయారు. దాంతో తన తల్లి దండ్రులు కుటుంబీకులు తీవ్రంగా ఆవేదన చెందారు. బొడ్డు తాడు తెంచడంలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యమే శిషువు మరణానికి దారి తీసిందిన వారు నమ్మారు. దాంతో ఇక ఇంట్లో ఎవరు గర్భిణి అయినా ఆస్పత్రిలో ప్రసవం నిషేధించారు. ఇంట్లోనే అమ్మమ్మ ప్రసవం చేసేది. కంగన తల్లి మొదటి బిడ్డను కోల్పోయిన తర్వాత ముగ్గురిని ఇంట్లోనే ప్రసవించగా, తన అత్తమ్మ కూడా ఇద్దరిని ఇంట్లోనే ప్రసవించింది. ఐదుగురికి అమ్మమ్మ పురుళ్లు పోసిందని కంగన చెప్పింది. హోటర్ ఫ్లైతో ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నిటినీ వెల్లడించింది. 10రోజులకే తన అన్న చనిపోయాడనే విషాదకర విషయాన్ని కంగన రివీల్ చేసింది. కంగనకు సోదరి రంగోలి.. సోదరుడు అక్ష్ ఉన్నారు.