పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రిలాక్స్ మోడ్ లో ఉన్నారు. అసలైతే ఆయన రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్స్ ఫినిష్ చేసే మూడ్ లో ఉండాలి కానీ.. ఫెడరేషన్ కార్మికుల సమ్మె ప్రభావంతో ప్రభాస్ నటించే చిత్రాలే కాదు టాలీవుడ్ మొత్తం స్తంభించింది. ఇక రాజా సాబ్ లో ప్రభాస్ ఎలా ఉంటారో అనేది రాజా సాబ్ టీజర్ తోనే క్లారిటీ ఇచ్చేసారు మేకర్స్.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న ఇంటెన్స్ లవ్ స్టోరీ ఫౌజీ లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నారు, ఆయన రోల్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ మాత్రం అభిమానుల్లో చాలా ఉంది. ఫౌజీ ఓపెనింగ్ లో హను తో కనిపించిన ప్రభాస్.. ఆతర్వాత ఇప్పటి వరకు ఆ చిత్రానికి సంబందించిన ఎలాంటి అప్ డేట్ అఫీషియల్ గా రాలేదు.
అయితే తాజాగా ప్రభాస్ ఫౌజీ లో ఎలా ఉంటారో అనేది ఆ సెట్ నుంచి లీకైన పిక్ చెబుతుంది. ఫౌజీ లీకెడ్ పిక్ లో ప్రభాస్ చాలా లవ్లీ గా హ్యాండ్ సమ్ గా ఫైర్ తో కనిపించడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ లుక్ చూసి అభిమానులు డార్లింగ్ వింటేజ్ లుక్ లో అదిరిపోయాడంటూ ఆనందపడిపోతున్నారు.
ఫౌజీ సినిమా కథ 1940ల బ్రిటీష్ పాలనలో ఉన్న భారతదేశాన్ని ఆధారంగా తీసుకుని రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ ఒక భారత సైనికుడిగా కనిపించబోతున్నారు. ఆర్మీ బ్యాక్‌డ్రాప్ కావడంతో, సెట్ డిజైనింగ్, యాక్షన్ సన్నివేశాలు, వార్ ఎఫెక్ట్స్ అన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించబోతున్నారని సమాచారం.