హీరోల ఇంట్రడక్షన్ సీక్వెన్స్ చూసి అభిమానులు విజిల్ వేసేలా చాలామంది స్టార్ డైరెక్టర్స్ ప్లాన్ చేస్తారు. హీరోలను ఎలా చూపిస్తే, ఎంత ఎలివేషన్ ఇస్తే అభిమానులు మెచ్చుతారు అనే విషయంపై దర్శకులు స్పెషల్ గా ఫోకస్ పెడతారు. అందుకే హీరోల ఎంట్రీ సీక్వెన్స్ ని చాలా హై లో తెరకెక్కిస్తారు.
పుష్ప, పుష్ప 2 చిత్రాలతో పాన్ ఇండియా మార్కెట్ లో క్రేజీగా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో AA 22 చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై వేదికగా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో అట్లీ ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ లుక్ టెస్ట్, హీరోయిన్ గా దీపికా పదుకొనె ఎంపిక అన్ని జరిగిపోయాయి. అల్లు అర్జున్ కూడా ఎక్కువగా ముంబైలోనే ఉంటున్నాడు.
తాజాగా AA 22 నుంచి వచ్చిన అప్ డేట్ ప్రకారం అట్లీ ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో 300 మంది ఆర్టిస్ట్ లు కనిపిస్తారని, సినిమాకి ఈ హీరో ఎంట్రీ సీక్వెన్స్ హైలెట్ గా నిలుస్తుంది అని, ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ చాలా కొత్తగా కనిపిస్తారని, ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేశారని టాక్.
AA 22 అనౌన్సమెంట్ వీడియో తోనే ఈ చిత్రం హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతుంది అని హింట్ ఇచ్చారు మేకర్స్. AA 22 లో నలుగురు హీరోయిన్స్ కనిపిస్తారని, అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారనే ప్రచారం ఉంది.