Advertisementt

భారమంతా మెగాస్టార్ పైనే

Mon 18th Aug 2025 12:22 PM
chiranjeevi  భారమంతా మెగాస్టార్ పైనే
Telugu Industry Pins Their Hopes On Chiranjeevi భారమంతా మెగాస్టార్ పైనే
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ భారమంతా మెగాస్టార్ పైనే పడింది. ఏ నిర్మాత చూసినా ఏ కార్మికుడు చూసినా మెగాస్టార్ చిరు చెబితే తూచా తప్పకూడా పాటిస్తామని చెబుతున్నారు. గత 15 రోజులుగా టాలీవుడ్ లో సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడికక్కడే ఆగిపోయాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఇలా అసలు షూటింగ్ అనేది లేకుండా కార్మికులు సమ్మె చేస్తుంటే రోజువారీ జీతాలు తీసుకునే కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. 

మరోపక్క కోట్లకు కోట్లు అప్పులు తెచ్చి సెట్ పై ఉన్న సినిమాలతో నిర్మాతలకు ఆర్ధిక భారం ఎక్కువైంది. ప్రొడ్యూసర్స్ పెట్టిన నాలుగు కండిషన్స్ లో రెండు ఒప్పుకున్నా మిగతా రెండు కండిషన్స్ దగ్గర ఇంకా సందిగ్దత నెలకొంది. నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు విడివిడిగా చిరుని కలుస్తున్నారు, మీడియా ముందు మట్లాడుతూ.. ఈ సమస్యకు చిరు పరిష్కారం చెబుతారని ఆశిస్తున్నామంటున్నారు. 

నిన్న పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు విడివిడిగా మెగాస్టార్ ని కలిశారు. ఈరోజు యూసఫ్ గూడలోని ఫెడరేషన్‌ ఆఫీస్ లో 24 క్రాఫ్ట్స్ నాయకుల భేటీ కానున్నారు ఉ.11 గంటలకు జరగనున్న సమావేశానికి 24 కార్మిక సంఘాల నేతలు హాజరుకానున్నారు. ఈ మీటింగ్ లో కార్మికుల వేతనాలు, సమస్యలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. అనంతరం సా.4 గంటలకు చిరంజీవి నివాసంలో సమావేశం కాబోతున్నారు. 

మరి అందరితో విడివిడిగా చర్చించిన చిరు ఈరోజు సమావేశం తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు, ఈరోజు తో ఈ సమ్మె ముగుస్తోందా, చిరు ఏం చెప్పబోతున్నారు అనే క్యూరియాసిటీ ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది. మరి ఈ భారాన్ని మెగాస్టార్ దించుతారో, ఉంచుతారో చూడాలి. 

Telugu Industry Pins Their Hopes On Chiranjeevi :

Producers and Federation members to meet Chiranjeevi

Tags:   CHIRANJEEVI
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ