మిక్స్డ్ టాక్ తోనే సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి చిత్రం ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి 350 కోట్ల మార్క్ ని అందుకుని నిజంగా అందరిని ఆశ్చర్యపరిచింది. కారణం భారీ అంచనాల నడుమ విడుదలైన కూలి చిత్రానికి మొదటిరోజు మిక్స్డ్ టాక్ రావడం సూపర్ స్టార్ ఫ్యాన్స్ నే కాదు కామన్ ఆడియన్స్ ను సైతం డిజప్పాయింట్ చేసింది.
సూపర్ స్టార్ రజిని ఎలివేషన్స్, నాగార్జున సైమన్ కేరెక్టర్, సౌబిన్ కేరెక్టర్, అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ తప్ప కూలి లో చెప్పుకునే విషయాలేమి లేకపోవడం, లోకేష్ కనగరాజ్ మార్క్ మిస్ అవడం అన్ని కూలి కి మిక్స్డ్ టాక్ వచ్చేలా చేసాయి. కానీ కూలి మీదున్న హైప్ తో లాంగ్ వీకెండ్ లో కూలి బుకింగ్స్ బావుండడంతో కూలి కి కలిసొచ్చింది.
అందుకే ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి కూలి కి 350 కోట్లు వచ్చాయి. అయితే ఈరోజు నుంచి కూలి ఆక్యుపెన్సీ ఎలా ఉంటుందో, మండే టెస్ట్ లో కూలి పాస్ అవుతుందా, మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న కూలి ని వీక్ డేస్ లో చూసేందుకు ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారా అనేది ఆసక్తిగా మారింది.