ఎప్పుడో విడుదల కావాల్సిన మెగాస్టార్ విశ్వంభర చిత్ర టీజర్ గ్రాఫిక్స్ పై వచ్చిన విమర్శల కారణంగా సినిమా జనవరి 10 న పోస్ట్ పోన్ అయ్యి ఇప్పటివరకు కొత్త రిలీజ్ తేదీని ఇవ్వడానికి మేకర్స్ జంకుతున్నారు. వీఎఫెక్స్ పనులు వలనే విశ్వంభర రిలీజ్ తేదీ వెనక్కిపోతుంది. రీసెంట్ గా వచ్చిన పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు గ్రాఫిక్స్ పై ఎంతెలాంటి విమర్శలొచ్చాయో నిన్నటివరకు సోషల్ మీడియాలో చూసారు.
ఆఖరికి అనుష్క ఘాటీ కూడా గ్రాఫిక్స్ వర్క్స్ విషయంలో పదే పదే రిలీజ్ డేట్స్ వాయిదాలు వేసుకుంది. ఇప్పుడు హిందీలో భారీ బడ్జెట్ తో భారీ స్పై యూనివర్స్ గా వచ్చిన వార్ 2 చిత్రం గ్రాఫిక్స్ పై వస్తోన్న ఫీడ్ బ్యాక్ చూసాక.. టెక్నాలజీ ఇంత డెవెలెప్ అయ్యింది, పెద్ద పెద్ద డైరెక్టర్స్ గా కోట్లు నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కానీ విఎఫెక్స్ విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
వార్ 2లో హీరోల పెరఫార్మెన్స్ అద్దిరిపోయిందీ, యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవల్, అన్ని బాగానే ఉన్నాయి. కానీ వార్ 2 గ్రాఫిక్స్ పై సినీవిమర్శకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్టీఆర్ షర్ట్ లెస్ ఫోజ్ పైన కూడా కామెంట్లు పడుతున్నాయి. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ చూపించారు, కానీ ఆ వీఎఫెక్స్ వర్క్ ఎంత వీక్ గా ఉందొ అనేది చూస్తే తెలిసిపోతుంది. హీరో సిక్స్ ప్యాక్ చూస్తే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ రావాలి, కానీ విమర్శలపాలవ్వకూడదు.. అనేది అభిమానుల మాట.
మరి చిన్న దర్శకులు గ్రాఫిక్స్ విషయంలో తేలిపోయారంటే ఓకె అనుకోవచ్చు కానీ పెద్ద పెద్ద దర్శకులే ఈ వీఎఫెక్స్ విషయంలో ఇలాంటి చీప్ క్వాలిటీ ని ప్రెజెంట్ చేస్తే ఎలా అంటూ ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తున్నారు.