వార్2 చిత్రం గ్లామర్ డాల్ హీరోయిన్ కియారా అద్వానీ కి ఇచ్చింది. ఆమెను చాలా డిజప్పాయింట్ చేసింది. ఇద్దరు స్టార్ హీరోల నడుమ హీరోయిన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో అనేది కమర్షియల్ మూవీస్ లో చూపించినట్టుగానే కియారా పాత్ర వార్ 2లో ఉంది. గ్లామర్ గా ఊపిరి ఊయలగా సాంగ్ లో అద్భుతంగా ఆకట్టుకుంది.
అంతవరకేనా కియారా అద్వానీ పాత్ర అన్నట్టుగా ఆమె కేరెక్టర్ ను దర్శకుడు అయాన్ ముఖర్జి మరీ లైట్ తీసుకున్నాడు. వార్2 లో ఆమె పాత్ర చూసికుని కియారా అద్వానీ చాలా డిజప్పాయింట్ అయ్యి ఉంటుంది. ఆమె మాత్రమే కాదు ఆమె అభిమానులు ఇంకా డిజప్పాయింట్ అవుతున్నారు.
గేమ్ చేంజర్ తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న కియారా అద్వానీ కి బాలీవుడ్ వార్ 2 ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకున్నారు. అటు వార్ 2 కి మిక్స్డ్ టాక్ రావడంతో కియారా అద్వానీ గురించి మాట్లాడుకునేవారు కూడా కనిపించడం లేదు. మరి అమ్మడిని యష్ టాక్సిక్ అయినా ఆదుకోవాలని ఆమె అభిమానులు ఆరాటపడుతున్నారు.