స్టార్ హీరోలైన హృతిక్ రోషన్, ఎన్టీఆర్ లు ఎంతగా స్పాయిలర్స్ కు రిక్వెస్ట్ చేసారు. వార్ 2 చిత్రంలో చాలా ట్విస్ట్ లు, సీక్రెట్స్ ఉన్నాయి, వాటిని బయటపెట్టొద్దు, వార్ 2 సినిమాను ఎంతో కష్టపడి తెరకెక్కించాం. ఎంతో ప్యాషన్‌తో చేసిన ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాటిక్ దృశ్యాన్ని ఎక్స్ పీరియెన్స్ చేయడానికి అందరూ థియేటర్లలోనే సినిమాను చూడండి. దయచేసి సినిమాలోని సీక్రెట్లు, ట్విస్ట్‌లను రివీల్ చేయకండి.. స్పాయిలర్‌లను ఆపండి.. ఇది మీడియా, ప్రేక్షకులు, అభిమానులను మేం రిక్వెస్ట్ చేస్తున్నాము అంటూ దాదాపుగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లు వేడుకున్నారు.
కానీ వార్ 2 ఈరోజు విడుదలకగానే, అంటే మార్నింగ్ షో పూర్తయిన కొన్ని నిమిషాల్లోనే HD ప్రింట్ ఆన్ లైన్ లో దర్శనమివ్వడం అందరికి షాకిచ్చింది. తెలుగు, హిందీ రెండు వెర్షన్స్ ను HD ప్రింట్ ని లీక్ చేసి స్పాయిలర్స్ పైశాచికానందం పొందుతున్నారు. అసలు ఇలాంటి పైరసీ ని అరికట్టేందుకు నిర్మతలు కూడా ఎలాంటి స్టెప్ తీసుకోలేకపోతున్నారు.
అంత భారీ బడ్జెట్ సినిమా, ఎంతో కష్టపడి తీసిన మూవీ, హీరోలిద్దరూ చేతులెత్తి మరీ వేడుకున్నా వార్ 2 పైరసీని ఆపలేకపోయారు. ఇది నిజంగా నిర్మాతల వైఫల్యమే అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.