ప్రస్తుతం టాలీవుడ్ షూటింగ్స్ మొత్తం బంద్ అయ్యాయి. పాన్ ఇండియా మూవీస్, భారీ బడ్జెట్ మూవీస్, చిన్న సినిమాలు, మీడియం రేంజ్ సినిమాల షూటింగ్స్ మొత్తం కార్మికుల సమ్మెతో మూలపడ్డాయి. నిన్న శనివారం కార్మిక ఫెడరేషన్ తో నిర్మాతల చర్చలు విఫలమయ్యాయి. దానితో టాలీవుడ్ స్ట్రైక్ కంటిన్యూ అవుతుంది.
అయితే ఇప్పటికే షూటింగ్స్ పూర్తి చేసుకున్న సినిమాలు తాము అనౌన్స్ చేసిన డేట్స్ కి పక్కాగా రిలీజ్ అవుతాయి. కానీ ఇంకా షూటింగ్ మిగిలి ఉండి.. రిలీజ్ డేట్స్ అంటే డిసెంబర్, సంక్రాంతికి అన్న సినిమాలు టాలీవుడ్ బంద్ తో రిలీజ్ డేట్స్ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది.
అసలే పెద్ద సినిమాలు ఇచ్చిన తేదీలకు రాకుండా, పదే పదే వాయిదాలు పడుతున్నాయి. హీరోలు సంక్రమంగా డేట్స్ ఇవ్వకో, లేదంటే సీజీ వర్క్స్ కంప్లీట్ కాకనో ఇలా వాయిదాలు వేసుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు ఈ కార్మికుల సమ్మె ప్రభావం మరోసారి పెద్ద సినిమాల విడుదల తేదీలపై పడి మరోసారి రిలీజ్ డేట్స్ చేంజ్ అవడం పక్కా అంటున్నారు. చూద్దాం ఈ సమ్మె ప్రభావం ఎంత ఉండబోతుందో అనేది.