Advertisementt

రష్మిక ను అంతలా టార్గెట్ చేసింది ఎవరు

Mon 11th Aug 2025 02:54 PM
rashmika  రష్మిక ను అంతలా టార్గెట్ చేసింది ఎవరు
Rashmika opens up on negative PR and trolls రష్మిక ను అంతలా టార్గెట్ చేసింది ఎవరు
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఎంతగా టాప్ రేంజ్ కి ఎదిగిందో అంతే ఎక్కువగా ఆమెపై నెగిటివిటి ట్రోల్స్ కనిపించేవి. కొన్నిసార్లు ఆమె మాతృ భాష విషయంలో కాంట్రవర్సీలో ఇరుక్కునే రష్మిక ఆ కాంట్రవర్సీ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉండదు. అయితే తాజాగా తానొక ఎమోషనల్ పర్సన్ అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

నేనొక నటిని. నా పర్సనల్, అలాగే నా ప్రొఫెషనల్ లైఫ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఇంట్లో ఎలా ఉంటానో చూస్తే మీరు షాకవుతారు. నేను చాలా ఎమోషనల్‌ పర్సన్‌ని. కానీ, నేను నా ఎమోషన్స్ ను బయటికి చూపించను, ఎందుకంటే అది చూపించినా నెగిటివి అంటగడతారు. అంతేకాదు నా మీద ట్రోల్స్ చేసేందుకు డబ్బులిస్తున్నారు. డబ్బులిచ్చి నన్ను టార్గెట్ చేస్తున్నారు అంటూ రష్మిక సన్సేషనల్ కామెంట్స్ చేసింది.  

నా ఫ్యాన్స్ నా దయా గుణాన్ని చూసి నా బలహీనత అనుకుంటారు. లేకపోతే నేను కెమెరాల కోసమే ఇదంతా చేస్తున్నా అనుకుంటారు. మనం ఎంత నిజాయితీగా ఉన్నా, అది మనపై వ్యతిరేఖత పెంచుతుంది. అందుకే నేను ఎక్కువగా నా ఎమోషన్స్ ను ఎక్స్ప్రెస్ చెయ్యను. దానితో పాటు నా చుట్టూ ఉండే నెగిటివిటీతో ప్రభావితం కాకుండా ఉండటానికి కూడా నేను చాలా కష్టపడుతుంటాను అంటూ రష్మిక తనెంత ఎమోషనల్ పర్సనో చెప్పుకొచ్చింది.

 మరి రష్మిక ఆరోపిస్తున్నట్టుగా రశ్మికను అంతలా ఎవరు టార్గెట్ చేస్తున్నారో అంటూ నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. 

Rashmika opens up on negative PR and trolls:

Rashmika Mandanna opened up about dealing with trolls 

Tags:   RASHMIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ