సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ విడుదలకు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా దేశ విదేశాల్లో భారీ క్రేజ్ నెలకొనడంతో ప్రీరిలీజ్ బిజినెస్ అత్యంత భారీగా జరిగింది. దాదాపు 375 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కి నాలుగు రోజులు ఉండగానే 250 కోట్ల మేర బిజినెస్ చేసిందని ట్రేడ్ చెబుతోంది.
ఆగస్ట్ 14 రిలీజ్ ని పురస్కరించుకుని ఇప్పటికే రజనీకాంత్ మాస్ ఫ్యాన్స్ లో పూనకాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలోనే కూలీ ప్రీబజ్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. కూలీ దేశీయంగానే కాదు, అంతర్జాతీయ మార్కెట్లోను భారీ హైప్ తో విడుదలవుతోంది. దానికి తగ్గట్టే ప్రీబిజినెస్ కూడా వర్కవుటైంది. ఇప్పటికే అంతర్జాతీయ డీల్స్ ప్రకారం మేకర్స్ 68 కోట్లు తమ ఖాతాలో వేసుకున్నారని తెలుస్తోంది. డిజిటల్, మ్యూజిక్, శాటిలైట్ హక్కులను కలుపుకుని 250 కోట్లు వసూలైందని తెలుస్తోంది. కేవలం విదేశాల నుంచి ప్రీబుకింగుల రూపంలోనే 30 కోట్లు వసూలైంది. ఇక ఇంటర్నేషనల్ బిజినెస్ రూపంలో విజయ్ `లియా` రికార్డును కూడా ఇది కొట్టేసింది.
లియో అంతర్జాతీయ మార్కెట్ నుంచి 66కోట్లు ప్రారంభ రోజున వసూలు చేయగా, ఇప్పటికే ఈ రికార్డును అధిగమిస్తూ కూలీ 68కోట్లు రాబట్టింది. తమిళనాడులో తెల్లవారుఝాము షోలు లేకపోయినా ఇరుగు పొరుగున ఉన్న ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూలీ కోసం భారీ షోలు వేస్తున్నారు. వీటి ద్వారా భారీ మొత్తాలను రజనీ చిత్రం రాబట్టగలదు. తమిళనాడు సహా ఉత్తరాదిలోను కూలీ అత్యంత భారీ హైప్ తో విడుదలవుతోంది.