వార్ 2 హీరోయిన్ కియారా అద్వానీ వార్ 2 ప్రమోషన్స్ ను పక్కన పెట్టేసింది. కారణం ఆమె రీసెంట్ గా డెలివరీ అవడంతో ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీకుంటుంది. కియారా గత నెలలోనే పండంటి పాపకు జన్మనిచ్చింది. సిద్దార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న రెండేళ్లకు కియారా పాపకు జన్మనిచ్చింది.
దానితో తమ కుమార్తె తో కియారా ఆమె భర్త సిద్దార్థ్ లు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. వార్ 2 ప్రమోషన్స్ లో హడవిడి చెయ్యాల్సిన కియారా అద్వానీ తాజాగా సోషల్ మీడియాలో తమ కుమార్తె తో కలిసి గడుపుతున్న క్షణాలను షేర్ చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా..
నేను నీ డైపర్లు మారుస్తున్నాను, నువ్వేమో నా ప్రపంచాన్నే మార్చేశావు. ఈ డీల్ చాలా బాగుంది అంటూ కళ్లలో నీళ్లు తిరుగుతున్న ఎమోజీ, చేతితో హార్ట్ సింబల్ చూపిస్తున్న ఎమోజీని కియారా అద్వానీ జత చేసింది. ఇక కియారా నటించిన వార్ 2 మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సిద్దార్థ్ మల్హోత్రా నటించిన పరం సుందరి ఈనెల చివరిలో విడుదల కాబోతుంది.