కార్మిక ఫెడరేషన్ తో నిర్మాతల చర్చలు విఫలమయ్యాయి. నిర్మాతలు వేతన సవరణకు అంగీకరించారు. అయితే మొదటి విడత 15శాతం, రెండో విడత 5 శాతం, మూడో విడత 5శాతం పెంపును వర్తింపజేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఇది 2000 దినసరి వేతనం అందుకునే కార్మికులకు వర్తించదు. వెయ్యి అంతకంటే తక్కువ అందుకునే కార్మికులకు వర్తింపజేస్తామని అన్నారు. చిన్న సినిమాలకు అసలు వేతన సవరణ వర్తించదని తెలిపారు.
అయితే దీనికి తాము అంగీకరించలేదని ఫెడరేషన్ అధ్యక్షుడు అనీల్ వల్లభనేని ఒక మీడియా సమావేశంలో ప్రకటించారు. నిర్మాతలతో చర్చలు విఫలమయ్యాయని అన్నారు. ఫెడరేషన్ లో అసోసియేషన్లను విభజించి పాలించారని కూడా నిర్మాతలను తప్పు పట్టారు. 30శాతం పెంపు కార్మికులు అందరికీ వర్తింపజేయాలని అన్నారు. తమ మధ్య చర్చలు విఫలమయ్యాయని అన్నారు.
ఈ రెండు రోజుల్లో పరిష్కారం లభించకపోతే మెగాస్టార్ చిరంజీవి తాను జోక్యం చేసుకుంటానని అన్నారు. బహుశా చిరు సీన్ లోకి ఎంటరవ్వాల్సిన టైమ్ దగ్గర పడింది.