బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కొన్నాళ్లుగా కెరీర్ లోనే కాదు, వ్యకిగతంగాను ఇబ్బందులు పడ్డారు. కిరణ్ రావు కు విడాకులు ఇవ్వడం, ఆతర్వాత మరో మహిళను ప్రేమించడం ఇవన్నీ వివాదాస్పదమే. తాజాగా ఆమిర్ ఖాన్ పై ఆయన సోదరుడు ఫైసల్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఫైసల్ ఖాన్-అమిర్ ఖాన్ కు మద్యన ఎప్పటినుంచో విభేదాలున్నాయి.
కానీ ఫైసల్ ఖాన్ ఇప్పుడు ఆమిర్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేస్తున్నాడు. ఆమిర్ నన్ను ఏడాది పాటు గదిలో బంధించాడు, నేను బయటికి రాకూండా గూండాలను పెట్టాడు. నాకు తిండి, మందులు తప్ప మరొకటి ఇవ్వలేదు. కొన్నేళ్ల పాటు తాను తన అన్న వల్ల మనో వేదన అనుభవించినట్లు ఫైసల్ మీడియా కు తెలిపాడు.
తాను పిచ్చివాడినని, తన వలన సమాజానికి హాని కలుగుతుంది అంటూ తనని గదిలో బందించారని, నా ఫోన్ కూడా లాగేసుకుని, బయట సెక్యూరిటీ పెట్టి వేధించాడు, నేను ఏమి చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఏడాది పాటు బందీని అయ్యాను అంటూ ఫైసల్ ఖాన్ సోదరుడు ఆమిర్ ఖాన్ పై చేసిన ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.