Advertisementt

బుల్లితెర‌ పారితోషికంలో నంబ‌ర్-1 న‌టి

Sat 09th Aug 2025 01:18 PM
smriti irani  బుల్లితెర‌ పారితోషికంలో నంబ‌ర్-1 న‌టి
Smriti Irani The highest-paid TV actor బుల్లితెర‌ పారితోషికంలో నంబ‌ర్-1 న‌టి
Advertisement
Ads by CJ

టెలివిజ‌న్ సీరియ‌ళ్లలో ఒక‌ ఎపిసోడ్ కు అత్యంత భారీ పారితోషికం అందుకుంటున్న న‌టిగా స్మృతి ఇరానీ రికార్డుల‌కెక్కారు. ఈ న‌టి కం రాజ‌కీయ నాయ‌కురాలు తాజా సీరియ‌ల్ లో న‌టిస్తున్నందుకు ఒక ఎపిసోడ్ కోసం ఏకంగా 14ల‌క్ష‌ల పారితోషికం అందుకుంటున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఈ పారితోషికం కొంత గ్యాప్ త‌ర్వాత వ‌చ్చినా న‌టి కం నాయ‌కురాలు స్మృతి ఇరానీకి క్రేజ్ త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తోంది. అనుప‌మా ఫేం రూపాలి గంగూలీ ఒక ఎపిసోడ్ కు 3ల‌క్ష‌లు, హీనా ఖాన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.2 లక్షలు ఆర్జిస్తున్నారు. ల‌క్ష పైగా అందుకునే న‌టీమ‌ణుల‌కు కొద‌వేమీ లేదు.

దాదాపు రెండు ద‌శాబ్ధాల క్రితం బుల్లితెర‌ను ఏలిన టీవీ సీరియ‌ల్ `క్యుంకి సాస్ భీ కభి బహు థి`. ఇప్పుడు ఈ సీరియ‌ల్ కి సీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు. కొన్నేళ్లుగా రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్న స్మృతి ఇరానీ ఇటీవ‌లే న‌ట‌న‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. పునః ప్ర‌వేశం ఆరంగేట్ర‌మే సెన్సేష‌న్స్ సృష్టిస్తున్నారు.

క్యుంకి సాస్ భీ కభి బహు థి కొత్త సీజ‌న్ లో విరానీ ఫ్యామిలీ ఆద‌ర్శ కోడ‌లు తుల‌సి విరానీగా క‌నిపించ‌నున్నారు. స్మృతి ఇరానీ ఇంత‌కుముందు `జై భోలో తెలంగాణ` చిత్రంలో తెలంగాణ త‌ల్లి పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే.

Smriti Irani The highest-paid TV actor:

  Smriti Irani is once again TV highest-paid actor  

Tags:   SMRITI IRANI
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ