కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కి అలాగే దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి కి ఎప్పుడో క్షమాపణ చెప్పారు. అసలు ప్రశాంత్ నీల్ ఎందుకు SRK కు క్షమాపణ చెప్పారంటే.. తను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన సలార్ చిత్రాన్ని హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన డంకీ చిత్రానికి పోటీగా రిలీజ్ చేసారు.
డిసెంబర్ 21 న డంకీ రిలీజ్ అయితే డిసెంబర్ 22 న సలార్ విడుదలైంది. అయితే సలార్ చిత్రం వలన డంకీ కలెక్షన్స్ కి ఎఫెక్ట్ అయ్యింది. ఆ విషయంలోనే ప్రశాంత్ నీల్ షారుఖ్ఖాన్ రాజ్ కుమార్ హిరానీ కి సారీ చెప్పారు. సలార్ ను డిసెంబర్ 22 న విడుదల చెయ్యాలని అసలు అనుకోలేదని.. కానీ జ్యోతిష్కం ప్రకారమే సినిమాని విడుదల చెయ్యాల్సి వచ్చింది అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో SRK కు రాజ్ కుమార్ హిరానీ కి ప్రశాంత్ నీల్ సారీ చెప్పుకొచ్చారు.
మరి ప్రభాస్-పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో డిసెంబర్ 22 న విడుదలైన సలార్ చిత్రం మాస్ హిట్ గా నిలిచి 400 కోట్లు కొల్లగొట్టింది. ఆ ఎఫెక్ట్ షారుఖ్-రాజ్ కుమార్ హిరానీ డంకీ పై పడింది.