Advertisementt

ఉస్తాద్ భగత్ సింగ్ ఫినిష్-పవన్ ఫ్యాన్స్ షాక్

Tue 05th Aug 2025 08:10 AM
harish shankar  ఉస్తాద్ భగత్ సింగ్ ఫినిష్-పవన్ ఫ్యాన్స్ షాక్
Ustaad Bhagat Singh Schedule Wrapped ఉస్తాద్ భగత్ సింగ్ ఫినిష్-పవన్ ఫ్యాన్స్ షాక్
Advertisement
Ads by CJ

నిజమే పవన్ ఇచ్చే షాక్స్ ను తట్టుకుని నిలబడడం ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కు చేతకావడం లేదు. గత రెండేళ్లుగా పవన్ సినిమాలను ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అని వెయిట్ చేసారు. ఈ ఏడాది పవన్ ఏప్రిల్ నుంచి పవన్ ఫ్యాన్స్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది వరసగా నెలల గ్యాప్ లో మూడు సినిమాల షూటింగ్స్ పూర్తి చేశారు. 

వీరమల్లు పనైపోయింది. OG సెప్టెంబర్ 25 న రాబోతుంది. ఇప్పుడు హరీష్ శంకర్ తో కలిసి ఏకధాటిగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ని పవన్ కంప్లీట్ చేసేసారు. నిన్న సోమవారం ఉస్తాద్ షూటింగ్ జరుగుతున్న సమయంలో వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు ఉస్తాద్ షూటింగ్ ని అడ్డుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. 

అదేరోజు నైట్ దర్శకుడు హరి శంకర్ పవన్ కళ్యాణ్ తో ఉన్న పిక్ ని షేర్ చేస్తూ ఓ ఎగ్జైటింగ్ న్యూస్ చెప్పారు. దానితో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మాటిస్తే నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడడం, మీరు పక్కన ఉంటె కరెంట్ పాకినట్లే అంటూ పవన్ తో దిగిన ఫొటో ను హరీష్ షేర్ చేసారు. 

ఈరోజుని ఎప్పటికి మరిచిపోలేను అంటూ హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. పవన్ ఎనేర్జి మరింత పవర్ ని ఇచ్చింది, ఆయన సపోర్ట్ కు ధన్యవాదాలు అంటూ హారిష్ వేసిన ట్వీట్ వైరల్ గా మారింది. 

Ustaad Bhagat Singh Schedule Wrapped:

Harish Shankar update on Ustaad Bhagat Singh

Tags:   HARISH SHANKAR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ