మిల్కి బ్యూటీ తమన్నా 40 ప్లస్ ఏజ్ లోను ఇంకా పాలమీగడ మాదిరి మెరిసిపోతూనే ఉంది. విజయ్ వర్మ తో లవ్ బ్రేకప్ తర్వాత తమన్నా భాటియా షూటింగ్స్ తో బిజీ అయ్యి ఆ బాధను మరిచిపోయింది. తాజాగా ఆమె ఓ క్రికెటర్ ని వివాహం చేసుకోబోతుంది అని వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది. ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేని తమన్నా కొత్త వ్యాపారం మొదలు పెట్టబోతోంది.
అదలావుంటే అమ్మాయిలు అంటే టీనేజ్ గర్ల్స్ అయినా, 30 ప్లస్ ఉమెన్స్ అయినా మొహం పై వచ్చే మొటిమలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రకరకాల చిట్కాలు ట్రై చేసినా ఆ మొటిమలు వారిని వేధిస్తూనే ఉంటాయి. స్కిన్ డాక్టర్ దగ్గరకి వెళ్లడం, రకరకాల క్రీమ్స్ అప్లై చెయ్యడం, డిఫ్రెంట్ డిఫరెంట్ సోప్స్ ని వాడుతూ ఉండడం చేస్తూ ఉంటారు.
అయితే ఆ మొటిమలు పోయేందుకు తమన్నా ఓ సింపుల్ చిట్కా చెప్పింది. ఆ చిట్కా విమర్శలపాలయినా.. తమన్నా చిట్కా ను ఒకసారి పాటిస్తే పోలా అనుకుంటున్నారు అమ్మాయిలు. ఆమె ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మొహం పై మొటిమలు పోవాలంటే తమ నోటిలోని ఉమ్మి తీసుకుని మొటిమలపై అప్లై చెయ్యాలని, అది ఉదయం ఉమ్మి అయితే ఇంకా మంచిదని చెప్పింది.
దానికి రీజన్ కూడా ఉంది, ఉదయం లేవగానే నోటిలో ఉమ్మిలో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ను రాస్తే అవి మొటిమలతో పోరాడుతాయి, నేను డాక్టర్ ని కాదు కానీ.. ఇది నా పర్సనల్ చిట్కా అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.