Advertisementt

సౌండ్ లేని కింగ్ డమ్ హిందీ వెర్షన్

Sun 03rd Aug 2025 09:20 PM
samrajya  సౌండ్ లేని కింగ్ డమ్ హిందీ వెర్షన్
Kingdom without sound Hindi version సౌండ్ లేని కింగ్ డమ్ హిందీ వెర్షన్
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ కి తెలుగులో వస్తున్న రెస్పాన్స్ మిగతా లాంగ్వేజెస్ లో రావడం లేదు. గురువారం విడుదలైన కింగ్ డమ్ కి తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే సెకండ్ హైయ్యెస్ట్ ఓపెనర్ గా కింగ్ డమ్ నిలిచింది. ఇక పాన్ ఇండియా మూవీగా విడుదలైన కింగ్ డమ్ మిగతా భాషల్లో అంతగా పెర్ఫార్మ్ చెయ్యలేకపోయింది. 

లైగర్ తో నార్త్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్న విజయ్ దేవరకొండ కు ఆ చిత్రం షాకిచ్చాక ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలను రెండు తెలుగు రాష్టాలకే పరిమితం చేసినా కింగ్ డమ్ ని మాత్రం పాన్ ఇండియా మూవీగా విడుదల చేసారు. అయితే కింగ్ డమ్ ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ పాన్ ఇండియా మర్కెట్ ని వదిలేసారు. 

అందుకే మిగతా లాంగ్వేజెస్ ముఖ్యంగా నార్త్ లో కింగ్ డమ్ సామ్రాజ్య టైటిల్ తో విడుదలైనప్పటి అక్కడ సౌండ్ వినిపించడం లేదు. మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికి.. రెండోరోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లోనూ కింగ్ డమ్ కలెక్షన్స్ డ్రాప్ అవడం మేకర్స్ కి షాకిచ్చే విషయమే. ఇక మిగతా భాషల్లో హడావిడి చెయ్యకుండా విడుదలైన ఈ చిత్రాన్ని ఆయా ప్రేక్షకులు కూడా అంతే  లైట్ తీసుకున్నారు. 

Kingdom without sound Hindi version:

Vijay Devarakonda Samrajya hindi update 

Tags:   SAMRAJYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ