Advertisementt

విజయ్ పై రష్మిక కు ఎంత ప్రేమో చూశారా

Sat 02nd Aug 2025 12:30 PM
rashmika  విజయ్ పై రష్మిక కు ఎంత ప్రేమో చూశారా
Rashmika watched Kingdom movie విజయ్ పై రష్మిక కు ఎంత ప్రేమో చూశారా
Advertisement
Ads by CJ

విజయ్ దేవరకొండ-రష్మిక నడుమ స్నేహముందా, లేదంటే ప్రేమ ఉందా అనేది కొద్దికొద్దిగా క్లారిటీ వస్తుంది. విజయ్ దేవరకొండ సినిమా వస్తుంది అంటే రష్మిక చాలా ఎగ్జైట్ అవుతుంది. కొద్దిరోజులుగా విజయ్ విజయాలకు దూరమవడం, రష్మిక మందన్న సక్సెస్ తో దూసుకుపోవడం చూస్తున్నాం. అందుకే విజయ్ దేవరకొండ హిట్ కొట్టాలని ఆమె బలంగా కోరుకుంది. 

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ రిలీజ్ అవ్వగానే టాక్ చూసిన రష్మిక విజయ్ మనం కొట్టినం అంటూ పెట్టిన పోస్ట్ ఎంతగా ట్రెండ్ అయ్యిందో.. కింగ్ డమ్ రిలీజ్ రోజున విజయ్ దేవరకొండ కోసం కింగ్ డమ్ ప్రీమియర్ షో చూసేందుకు రష్మిక ఎంతగా కష్టపడిందో నిర్మాత నాగవంశీ చెప్పడం హైలెట్ అయ్యింది. 

కింగ్ డమ్ సినిమాకి హైదరాబాద్ లో ఏడు గంటలకే ప్రీమియర్స్ పడడంతో రష్మిక శ్రీరాములు థియేటర్స్ లో కింగ్ డమ్ చూడాలనుకుందట. కానీ ఆమె వెళ్లడం వలన సెక్యూరిటీ ప్రోబ్లెంస్ వస్తాయని ఆమెకి అనుమతి ఇవ్వకపోవడంతో రష్మిక తన గెటప్ ని టోటల్ గా మార్చేసి మరీ కూకట్ పల్లిలోకి భ్రమరాంబ మల్లికార్జున థియేటర్ కి వెళ్లి కింగ్ డమ్ చిత్రాన్ని సైలెంట్ గా చూసి ఎంజాయ్ చేసి వచ్చేసిందట. 

మరి ఇదంతా విజయ్ దేవరకొండ పై ప్రేమ కాకపోతే ఇంకేముంటుంది. అది ప్రేమే, అందుకే ఇలా అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు. 

Rashmika watched Kingdom movie:

In disguise and among fans Rashmika watches Kingdom

Tags:   RASHMIKA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ