మహానటి కీర్తి సురేష్ గ్లామర్ షో గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. కారణం ఆమె తరచూ అందాలు ఆరబోసే పనిలో బిజీగా ఉంటుంది. పెళ్లయింది, ఇకపై గ్లామర్ షో చెయ్యదు అనుకున్నారు. కానీ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత మరింత హాట్ గా తయారైంది.
మోడ్రెన్ డ్రెస్సులతో మరింతగా రెచ్చి పోతుంది. సోషల్ మీడియా వేదికగా తన గ్లామర్ షో ని పోస్ట్ చేస్తూ కవ్విస్తుంది. గత ఏడాది డిసెంబర్ లో కీర్తి సురేష్ తన చిన్నప్పటి ఫ్రెండ్ ఆంటోనీని వివాహం చేసుకుంది. ఆ తరవాత ఆమె సినిమా షూటింగ్స్, ప్రమోషన్స్ అంటూ బిజీగా కనిపించింది.
కానీ ఇప్పుడు కీర్తి సురేష్ కి అనుకున్న అవకాశాలు రావడం లేదు. తాను పెళ్లి చేసుకున్నా నటనకు బ్రేకివ్వలేదు అని చెప్పేందుకు సోషల్ మీడియాను ఎంచుకుని అందులో గ్లామర్ ఫోటోస్ వదులుతుంది. తాజాగా అందాల ఆరబోతలో వేరే లెవల్ అంటూ కీర్తి సురేష్ కొత్త ఫోటోలను వదిలింది. ఆ పిక్స్ లో ఆమె ఏంతో హ్యాపీ గా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.