హీరోల అభిమానుల మధ్య కలహాలు సహజంగా ఉండేవే. కానీ ఇక్కడ సన్నివేశం వేరు. రే*ప్ చేస్తామని వార్నింగ్ ఇవ్వడమే గాక, చంపేస్తామంటూ స్టార్ హీరో భార్యను బెదిరించారు. అయితే ఈ సన్నివేశంలో స్టార్ హీరో వైఫ్ ని ఇంత దారుణంగా బెదిరించినది ఎవరు? అంటే.. ఇండస్ట్రీ కొలీగ్ - ప్రముఖ కన్నడ హీరో దర్శన్ ఫ్యాన్స్. వారంతా మూకుమ్మడిగా హీరోయిన్ రమ్య అలియాస్ దివ్య స్పందనకు వార్నింగ్ ఇచ్చారు.
రేణుకాస్వామి హత్యకేసులో నటుడు దర్శన్‌కు కర్నాటక హైకోర్ట్ బెయిల్ ఇవ్వడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన న్యూస్ క్లిప్ ని రమ్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, రేణుకాస్వామికి న్యాయం జరగాలని కోరుకున్నారు. సుప్రీం కోర్టు పేదవారి ఆశాదీపం అని కూడా అన్నారు. అయితే ఇది దర్శన్ అభిమానులకు రుచించలేదు. రమ్య అలియాస్ దివ్య స్పందన వ్యాఖ్యలపై వెంటనే ఎటాక్ మొదలైంది. పరుష పదజాలంతో, అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్నారు.
అసలు హత్య చేయాల్సింది అతడిని కాదు నిన్ను! అంటూ రమ్యను భయపెట్టేందుకు ప్రయత్నించారు. కొందరు అత్యాచారం చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై నగర పోలీస్ కమీషనర్ కు, మహిళా కమీషన్ కు రమ్య ఫిర్యాదు చేసారు. ఇప్పుడు రమ్య (దివ్య స్పందన) కు సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా తనకు మద్ధతుగా బహిరంగంగా మాట్లాడారు. ఒక స్త్రీపై ఇలాంటి అసభ్యకర భాషను ఉపయోగించడం సరికాదని, దీనిని ఖండిస్తున్నానని శివన్న అన్నారు. తల్లులుగా, భార్యలుగా, సోదరీమణులుగా వారు గౌరవాన్ని అందుకోవాలని తాను కోరుకుంటానని అన్నారు.