యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా సోకులు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవక్కర్లేదు. చీర కట్టినా, ఫ్యామిలీ తో వెకేషన్ కు వెళ్లినా, గ్లామర్ డ్రెస్ వేసినా ఏది అయినా అనసూయ సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది.
ఇక అనసూయ చాలా స్ట్రయిట్ ఫార్వార్డ్ ఉన్న వ్యక్తి. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. అందుకే ఆమె కు ఫాలోవర్స్ కన్నా ఎక్కువగా అన్ ఫాలోవర్స్ ఉంటారు. అనసూయ ఎవ్వరు ట్రోల్ చేసినా వారిని నిర్దాక్షణ్యంగా అన్ ఫాలో చేసేస్తుంది. తాజాగా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ చూస్తే అందరిలో ఎన్నో అనుమానాలు.
కారణం ఆమె కళ్ళు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని పిల్లి కళ్ళు కాదు కాదు పాము కళ్ళు మాదిరి కొత్తగా భయపెట్టేలా కనిపించాయి. అంతేకాదు అనసూయ చీర కట్టులో ఎంత అందంగా కనిపించినా ఆమె కళ్ళు చూస్తే మాత్రం భయపడాల్సిందే.