ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Neel gets hefty pay cheque for NTR film

ఎన్టీఆర్ మూవీ కోసం నీల్ భారీ పారితోషికం

Neel gets hefty pay cheque for NTR filmNeel gets hefty pay cheque for NTR film

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో మార్చ్ లో మొదలై జెట్ స్పీడు తో షూటింగ్ జరుపుకుంటున్న డ్రాగన్(వర్కింగ్ టైటిల్)ఫస్ట్ లుక్ మే 20 ఎన్టీఆర్ బర్త్ డే కి రావాల్సింది కానీ.. అప్పుడు వార్ 2 నుంచి స్పెషల్ టీజర్ రావడంతో డ్రాగన్ సర్ ప్రైజ్ ని నీల్ పోస్ట్ పోన్ చేసారు. 

అదాలఉంటే క్రేజీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ భారీ పారితోషికం తో పాటుగా ఆయన లాభాల్లో 50 పర్సెంట్ షేర్ నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ని అడిగినట్లుగా తెలుస్తుంది. డ్రాగన్ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్-మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 

KGF సిరీస్, అలాగే సలార్ బిగ్గెస్ట్ హిట్స్ అవడంతో ప్రశాంత్ నీల్ డిమాండ్ కూడా పెరిగింది అని, ప్రశాంత్ నీల్ అడిగింది ఇవ్వడానికి మైత్రి వారు సిద్దమని తెలుస్తుంది. ఇక ఈ చిత్రం లో ఎన్టీఆర్ మాస్ అవతార్ లో అభిమానులకు సర్ ప్రైజ్ ట్రీట్ ఇస్తారని, ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది అనే ప్రచారం ఉంది. డ్రాగన్ మూవీని నీల్ జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Prashanth Neel will receive a substantial paycheck for NTR film

prashanth neel