Advertisementt

సందీప్ వంగా సినిమాతో పోలిక‌లా

Thu 24th Jul 2025 03:47 PM
sayaraa  సందీప్ వంగా సినిమాతో పోలిక‌లా
Comparing Sayaraa with Kabir Singh సందీప్ వంగా సినిమాతో పోలిక‌లా
Advertisement
Ads by CJ

షాహిద్ క‌పూర్- కియ‌రా అద్వాణీ జంట‌గా న‌టించిన క‌బీర్ సింగ్ ఆరేళ్ల క్రితం విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్రేమ‌క‌థా చిత్రాల్లో కొత్త ఒర‌వ‌డిని సృష్టించిన చిత్ర‌మిది. సందీప్ వంగా తెలుగులో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించిన `అర్జున్ రెడ్డి`ని హిందీలోను రీమేక్ చేసి అక్క‌డా పెద్ద హిట్టు కొట్టారు. క్రిటిక్స్ నుంచి విమ‌ర్శ‌లు ఎదురైనా కానీ, క‌బీర్ సింగ్ ఆ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

అయితే ప్రేమ‌క‌థా చిత్రాల్లో మ‌ళ్లీ ఆ స్థాయిలో ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న సినిమాగా `సయ్యారా` గురించి చెబుతున్నారు. మోహిత్ సూరి తెర‌కెక్కించిన ఈ చిత్రంలో కొత్త జంట అహాన్ పాండే- అనీతా ప‌ద్దా అద్భుతంగా న‌టించార‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.  ఈ సినిమా విడుద‌లైన నాలుగు రోజుల్లో దాదాపు 100 కోట్ల నిక‌ర వ‌సూళ్ల‌ను సాధించింది. ఐదు రోజుల‌కు 130 కోట్లు వ‌సూలు చేసింది. అయితే క‌బీర్ సింగ్ తొలి ఐదురోజుల్లో కేవ‌లం 104 కోట్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. అగ్ర తార‌లు న‌టించిన సినిమాను మించి డెబ్యూ తార‌లు న‌టించిన సినిమా వ‌సూలు చేస్తోంది. అయితే టికెట్ ధ‌ర‌ల ప‌రంగా చూస్తే, అప్ప‌టికి ఇప్ప‌టికి కొంత పెరుగుద‌ల ఉండ‌టం కూడా స‌య్యారా వ‌సూళ్ల లెక్క‌ల్ని పెంచింది.

ఐదురోజుల‌కు..

సైయారా -  కబీర్ సింగ్ వ‌సూళ్లు:

1 రూ 21.25 కోట్లు - రూ 20.25 కోట్లు

2 రూ 25.75 కోట్లు - రూ 22.75 కోట్లు

3 రూ 35 కోట్లు - రూ 28 కోట్లు

4 రూ 24 కోట్లు - రూ 17.25 కోట్లు

5 రూ 24.50 కోట్లు - రూ 16.50 కోట్లు

   రూ 130.50 కోట్లు - రూ 104.75 కోట్లు

   (మొత్తం నిక‌ర వ‌సూళ్లు)

Comparing Sayaraa with Kabir Singh:

Why Comparing Sayaraa with Sandeep Reddy Vanga Film

Tags:   SAYARAA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ