నితీష్ తివారీ `రామాయణం` చిత్రీకరణ శరవేగంగా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని రెండు భాగాలుగా నిర్మిస్తున్నారు. దీనికి నమిత్ మల్హోత్రా-యష్ నిర్మాతలు. దీనికోసం ఏకంగా 4000 కోట్ల బడ్జెట్ ని కేటాయించారని కథనాలొచ్చాయి. ముఖ్యంగా కాస్టింగ్ కోసం నిర్మాతలు పెద్ద మొత్తంలో బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు.
శ్రీరాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా, సీతగా సాయిపల్లవి నటిస్తోంది. అయితే రణబీర్ కపూర్ అంత పెద్ద స్టార్ సరసన సీత పాత్రకు సాయిపల్లవి సరిపోతుందా? అని కొందరు సందేహం వ్యక్తం చేసారు. దీనికి సమాధానంగా, సాయిపల్లవి సహజసిద్ధమైన అందం ఈ పాత్రకు వందశాతం సరిపోతుందని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ ఇప్పుడు సాయిపల్లవి షేర్ చేసిన నేచురల్ గ్లో లుక్ అందరినీ ఆకర్షిస్తోంది. సీత పాత్రకు సాయిపల్లవి తప్ప ఇంకెవరూ సరిపోరు! అంటూ పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. సహజసిద్ధమైన అందంతో ఆకర్షించడంలోనే కాదు, ప్రతిభతో మైమరిపించడంలోను సాయిపల్లవి ఎప్పుడూ విఫలం కాలేదు. ఇప్పుడు సీతాదేవి పాత్రలో జీవిస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.