Advertisementt

వైసీపీ నేత అనిల్‌ కుమార్‌ కు బిగుస్తున్న ఉచ్చు

Tue 22nd Jul 2025 05:20 PM
anil kumar yadav  వైసీపీ నేత అనిల్‌ కుమార్‌ కు బిగుస్తున్న ఉచ్చు
YSRCP leader Anil Kumar Yadav వైసీపీ నేత అనిల్‌ కుమార్‌ కు బిగుస్తున్న ఉచ్చు
Advertisement
Ads by CJ

వైసీపీ ప్రభుత్వం హయాంలో రౌడీ మంత్రిగా నోటికొచ్చినట్లుగా భూతులు మాట్లాడి అధినేత దృష్టిలో హీరో అనిపించుకోవాలని తహతహలాడిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అనిల్ కుమార్ యాదవ్ ఆల్మోస్ట్ సైలెంట్ అయ్యాడు. ఆ సైలెన్స్ ను చూసి అనిల్ కుమార్ పార్టీ మారుస్తున్నాడనే ప్రచారం వరకు వెళ్ళింది. అబ్బె లేదు నేను జగన్ వెంటే నడుస్తాను, పార్టీ మారే ప్రసక్తే లేదు అన్నాడు. 

అపుడప్పుడు మీడియా ముందు సౌండ్ చేసే అనిల్‌ కుమార్‌యాదవ్‌కు క్వార్జ్ అక్రమ రవాణా కేసులో ఉచ్చు బిగుస్తుంది. క్వార్జ్ అక్రమ రవాణా కేసులో అనిల్‌కుమార్ అనుచరుడు శ్రీకాంత్‌రెడ్డి నిన్న హైదరాబాద్‌లో అరెస్టు అయ్యాడు. క్వార్జ్ మైనింగ్ స్కామ్‌లో అనిల్‌కుమార్ యాదవ్ పాత్రపై వివరాలు వెల్లడించడం హాట్ టాపిక్ అయ్యింది.  

అనిల్, కాకాణితో నాకు వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, 2023 ఆగస్టు నుంచి అనిల్, కాకాణితో క్వార్జ్ వ్యాపారం చేశాను, లీజు గడువు ముగిసిన రుస్తుం మైన్ నుంచి క్వార్జ్ తీశాం. వాటి పనులన్నిటినీ వాకాటి శివారెడ్డి, వాకాటి శ్రీనివాసరెడ్డి చూసుకున్నారు, క్వారీని పర్యవేక్షించినందుకు నాకు టన్నుకు రూ.1000 ఇచ్చేవారు. 

నేను, అనిల్ కుమార్ యాదవ్ కలిసి గూడూరులో 100 ఎకరాల్లో వెంచర్ వేశాం, నాయుడుపేట వద్ద 50 ఎకరాల్లో వెంచర్ వేశాం, హైదరాబాద్‌లోనూ రెండు హౌసింగ్ ప్రాజెక్టులు చేశాం, మణికొండ అల్కాపురి, తుర్కయాంజల్‌లో వెంచర్లు వేశాం, 2024లో ప్రభుత్వం మారాక హైదరాబాద్‌కు మకాం మార్చాను. కేసులకు భయపడి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయినట్లుగా శ్రీకాంత్‌రెడ్డి చెప్పడంతో ఇప్పుడు ఈకేసు అనిల్ కుమార్ యాదవ్ వైపు తిరిగింది. 

YSRCP leader Anil Kumar Yadav:

Anil Kumar Yadav

Tags:   ANIL KUMAR YADAV
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ