ఇస్మార్ట్ శంకర్ తర్వాత చాలా బ్రేక్ వచ్చేసింది నిధి అగర్వాల్ కి. ఆ తర్వాత నిధి అగర్వాల్ కు ఇద్దరు పెద్ద హీరోలైన పవన్ కళ్యాణ్, ప్రభాస్ చిత్రాల్లో హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఆమె ఎగిరి గంతేసింది. కానీ ఆ రెండు చిత్రాలు అమ్మడు అనుకున్నట్టుగా కాకుండా ఏళ్ళ తరబడి సెట్ పైనే ఉన్నాయి. నిధి అగర్వాల్ నటించిన హరి హర వీరమల్లు, రాజా సాబ్ ఈఏడాది విడుదల కాబోతున్నాయి.
అమ్మడు హోప్స్ అన్ని హరి హర వీరమల్లు పైనే. పార్ట్ 1 గురువారమే విడుదల రాబోతుంది. వీరమల్లు ప్రమోషన్స్ లో హాట్ గా నిధి అగర్వాల్ మీడియా ముందు హడావిడి చేస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా నిధి అగర్వాల్ హరి హర వీరమల్లు ప్రమోషన్స్ భుజాన మోస్తుంది.. అని చెప్పారు. అదే నిజం. రాణి గా కనిపించబోతున్న నిధి కి వీరమల్లు హిట్ అత్యవసరం.
రాణి పాత్రలో నిధి అగర్వాల్ చాలా కష్టపడింది, వీరమల్లు ప్రమోషన్స్ లోను నిధి అగర్వాల్ అంతే కష్టపడుతుంది. మరి నిధి అగర్వాల్ కి కష్టానికి ప్రతిఫలం దక్కేనా, హరి హర వీరమల్లు హిట్ అయినా చాలు ఆమె పాత్ర ఎలా ఉన్నా నిధి అగర్వాల్ పేరు మోగిపోతుంది. వీరమల్లు రిజల్ట్ నిధి అగర్వాల్ కి ఎంత హెల్ప్ అవుతుందో చూడాలి.