Advertisementt

కూలీ vs వార్ 2 - శృతి హాసన్ రియాక్షన్

Mon 21st Jul 2025 08:36 PM
shruti haasan  కూలీ vs వార్ 2 - శృతి హాసన్ రియాక్షన్
Shruti Haasan Reacts To Coolie And War 2 Clash కూలీ vs వార్ 2 - శృతి హాసన్ రియాక్షన్
Advertisement
Ads by CJ

ఆగష్టు 14 న కూలీ, వార్ 2 చిత్రాలు బాక్సాఫీసు వద్ద పోరుకు సిద్ధమయ్యాయి. వార్ 2 vs కూలి బాక్సాఫీసు దగ్గర పోటీకి సిద్దమవగా.. చాలామంది కాదు కాదు పాన్ ఇండియా ప్రేక్షకులు ఈ రెండు చిత్రాల విషయం లో ఎలా ఫీలవుతున్నారో తెలియదు కానీ ఎన్టీఆర్ అభిమానులు, సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం తమ చిత్రం హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. రెండు సినిమాలు భారీ బడ్జెట్, మల్టీస్టారర్ మూవీస్ అవడంపై ఈ చిత్రాలపై అందరిలో అమితమైన ఆసక్తి ఉంది. 

ఇక కూలి చిత్ర హీరోయిన్ శృతి హాసన్ కూలి vs వార్ 2 పోటీపై రియాక్ట్ అయ్యింది. రెండు పెద్ద చిత్రాలు బాకాఫీసు వద్ద పోటీ పడడమనేది చాలా సహజం. నేను నటించిన సినిమాలే స్టార్ హీరోల సినిమాలతో చాలాసార్లు పోటీపడ్డాయి. సలార్ చిత్రం షారుఖ్ డుమ్కి తో పోటీ పడింది. రెండు చిత్రాలు ఒకేసారి విడుదలైతే నటీనటులు ఏమి చెయ్యలేరు. 

డెఫనెట్ గా వార్ 2, కూలి రెండు చిత్రాల కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. దానిని నిర్మాతలే చూసుకోవాలి, రెండు చిత్రాలకు మధ్య సమయం ఉండాలని. ఆడియన్స్ కు కూడా రెండు సినిమాలను వీక్షించే టైమ్ ఇవ్వాలి. లోకేష్ కనగరాజ్ కూలి చిత్రాన్ని అన్ని ఎమోషన్స్, యాక్షన్ తో తెరకెక్కిస్తున్నారు. 

వార్ 2 కూలి చిత్రాలు ఏవిటకవే ప్రత్యేకం. రెండు చిత్రాలు కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు అంటూ శృతి హాసన్ ఆగష్టు 14 బాక్సాఫీసు వార్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. 

Shruti Haasan Reacts To Coolie And War 2 Clash:

Shruti Haasan Breaks Silence On Epic Clash of Coolie - War 2 War 

Tags:   SHRUTI HAASAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ