కృతి శెట్టి, శ్రీలీల తర్వాత అంతే స్పీడుగా టాలీవుడ్ లో పాగా వేస్తున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. మొదటి సినిమా భారీ డిజాస్టర్. అయినా యంగ్ హీరోలంతా భాగ్యశ్రీ బోర్సే వైపే చూస్తున్నారు. ఒకటా రెండా వరస ఆఫర్స్ తో భాగ్యశ్రీ బోర్సే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఆమె నటించిన కింగ్ డమ్ మరొక్క వారం రోజుల్లో విడుదల కాబోతుంది.
ఆ సినిమా హిట్ ఆమె కెరీర్ ని డిసైడ్ చెయ్యదు, కారణం ఆమె చేతిలో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. అందులో ఆంధ్ర కింగ్ తాలూకా, అలాగే దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంత సినిమాలు ఉండడమే కాదు.. ఇప్పుడు హీరో నాని ప్యారడైజ్ చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే ని హీరోయిన్ గా అనుకుంటున్నారట.
ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు గ్లామర్ లుక్స్ తో సందడి చేసే భాగ్యశ్రీ బోర్సే తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోస్ చూస్తే షైనీగా బ్యూటిఫుల్ గా కనిపించింది. సింపుల్ గా టాలీవుడ్ ని ఏలడానికి రెడీ అయిన భాగ్యశ్రీ బోర్సే కి కింగ్ డమ్ కనుక సక్సెస్ ఇస్తే ఇకపై అమ్మడుని స్టార్ హీరోలు బుక్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. చూద్దాం భాగ్యశ్రీ బోర్సే లక్ ఎలా ఉందొ అనేది.!